భక్తి శ్రద్ధలతో ముత్తారం గ్రామంలో గణనాథ విగ్రహ ప్రతిష్టాపన
విగ్రహ దాతలు ఊరడి భారతి, జైపాల్ రెడ్డి, 40 వేల విలువ గల జనరేటర్ బహుకరణ
మహా అన్నదాన వితరణ
భీమదేవరపల్లి, ఆగస్టు 27 (ప్రజామంటలు):
భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామం ఆధ్యాత్మిక ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది. బుధవారం మధ్యాహ్నం గణనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య పురోహితులు అంజయ్య శాస్త్రి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని ఆవాహన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఊరడి భారతి, జైపాల్ రెడ్డి దంపతులు, వారి కుమారుడు శ్రీనిధి క్రాంతి కిరణ్ రెడ్డి దంపతులు, అంజలా - చైతన్య విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
విగ్రహాన్ని జైపాల్ రెడ్డి స్వయంగా దానం చేయగా, ఆలయంలో వినియోగం కోసం రూ.40,000 విలువైన జనరేటర్ ను కూడా విరాళంగా సమకూర్చారు. ప్రతిష్టాపన అనంతరం స్వామివారి విగ్రహానికి గ్రామస్థులు పూలమాలలు సమర్పించి, పాలాభిషేకం చేసి ఆశీర్వాదాలు పొందారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గణనాథునికి నమస్కరిస్తూ సాంప్రదాయ రీతిలో వందనాలు సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన మహా అన్నదానంలో వందలాది మంది భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో గ్రామ దేవతల గడ్డ – లంబోదరుని అడ్డ టీం సభ్యులు చురుకైన పాత్ర పోషించారు. గ్రామంలో గణనాథుడి ప్రతిష్టాపన జరగడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
