చేతలు కాదు కోతల సీఎం రేవంత్ రెడ్డి_ ఆరు గ్యారెంటీలు అమలులో అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం,_ ఎప్పటికైనా తెలంగాణ కు కేసీఆర్ యే శ్రీరామ రక్షా జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, ఆగష్టు 26(ప్రజా మంటలు)
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వలు రెండు రైతుల పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాయని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు. జిల్లాలో యూరియా కొరత పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్ చౌరస్తా లో ధర్నా చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...
తెలంగాణ లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదన్నారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరత్తనట్లు వ్యవహారిస్తుందని ఆరోపించారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చెయ్యడం విడ్డురంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయ్యాలన్నారు.
ఆరు గ్యారంటీ ల ఊసే లేదని, 420 హామీలతో తెలంగాణ ప్రజల్ని నిండా ముంచిందన్నారు. పాదయాత్ర లో తులం బంగారం, స్కూటీలు, నిరుద్యోగ భృతి, పెంచిన పెన్షన్ ఏ ఒక్కటి హామీ అమలు కాలేదన్నారు.
రైతు భరోసా, రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. నువ్వు కొట్టు, నేను ఏడుస్తా అన్నట్లుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలా వైఖరి ఉండడం బాధకారం అని అన్నారు. తెలంగాణ మళ్ళీ పునర్వభవం కావాలంటే బీఆర్ఎస్ అధికారం లోకి రావాలని, ఏనాటికైనా తెలంగాణ కు కేసీఆర్ యే శ్రీ రామ రక్షా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ రాయికల్ సారంగాపూర్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు బర్కం మల్లేష్ తెలు రాజు పట్టణ ఉప అధ్యక్షుడు వొళ్ళం మల్లేశం ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు మాజీ జడ్పీటీసీ లు మహేష్ కొలుముల రమణ మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్ మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్ గౌడ్, లక్ష్మణ్ రావు,ఎల్లా రాజన్న గంగాధర్ అంజన్న వెంకటేష్ మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ ఆసిఫ్ ఉప సర్పంచ్ పద్మ తిరుపతి నాయకులుశీలం ప్రవీణ్ కమలాకర్ రావు వెంకటేశ్వర్ రావు గంగారెడ్డి మల్లేష్ హరీష్ అనురాధ నక్క గంగాధర్ గాజుల శ్రీనివాస్ వోల్లల గంగాధర్ నిరంజన్ అది రెడ్డి శ్రీపాల్ మోహన్ పుదరి శ్రీనివాస్ భాస్కర్ నాయక్ బాలే చందు ప్రతాప్ ప్రణయ్ భగవాన్ భారత్ బోగు సత్తయ్య యోహన్ సాయి వెంకట్ ముత్యం చాంద్ కిషన్ రవి ఫహద్ వహీద్ రైతులు బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
