రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొత్త ఏకో పార్క్ ల ఏర్పాటు - ఏకో టూరిజంపై సీఎం సమీక్ష
హైదరాబాద్ ఆగస్ట్ 12:
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మనకు భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు.. అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళుతున్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెంచేలా సౌకర్యాలు కల్పించాలి.
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సంయుక్త సర్వే చేపట్టాలి. వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వరంగల్‌లో జూ ను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి.
అటవీ జంతువుల దాడిలో మృతిచెందిన లేదా గాయపడిన వారికి, పశువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. అందుకు సీఎంఆర్ఎఫ్ నుంచి అవసరమైన మేరకు నిధులు వినియోగించుకోవాలి.
అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల విషయంలో అటవీ శాఖ, ఆయా పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధించాలి.
అడవుల్లో వన్య ప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలి. అటవీ శాఖలో అధికారుల కొరతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్రంతో సంప్రదించాలి.
అటవీ శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలి. శాఖలో ఉత్తమ పని తీరు కనబరిచే వారికి అవార్డులను ఇచ్చే ప్రక్రియను పునరుద్ధరించాలి. ఈ సమావేశంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాష్ట్రంలోని భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల అశోక్

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
.jpg)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు
