షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కృష్ణానగర్ లోని, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయి సచ్చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి మళ్లీ గురువారం వరకు ఈ పారాయణం కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది.
108 మంది భక్తులు సామూహికంగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం ప్రారంభించారు. ఉదయం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పఠ ణం, సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం, మహా హారతి జరిగింది.ఆలయ ప్రధాన అర్చకులు వేణుమాధవాచార్య, ప్రముఖ పండితులు నారాయణ శర్మ, కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు. ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మారకైలాసం, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, వొద్దినేని పురుషోత్తం రావు, అయిల్ నేని రాo కిషన్ రావు, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తౌటు రవిచంద్ర, కంచి కిషన్, సిరపరపు రాజలింగం, యాదగిరి మారుతి రావు, చిలుక మారి గంగాధర్, కడలి రామకృష్ణారావు, భక్తులు, మాతలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
