పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం
ఐఏఎస్ అరవింద్ కుమార్ తోపాటు మరో ఇద్దరిని విచారించండి..
- న్యాయవాది రామారావు పిర్యాదును స్వీకరించిన లోకాయుక్త
సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) :
పుప్పాల గూడ లోని సర్వేనెంబర్ 277,280,281 సంబందించి భారీ కుంభకోణం జరిగిందని, ఈవిషయంలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు లోకాయుక్త లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐఏఎస్ మాజీ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, డీఎస్ఆర్ఎస్ఎస్ఐ అధినేత రఘురామరెడ్డి, మాజీ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ డైరెక్టర్ శివబాలకృష్ణ లను విచారిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని న్యాయవాది రామారావు లోకాయుక్తకు ఇచ్చిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈమేరకు రామారావు ఇచ్చిన ఫిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెప్టెంబర్ 28లోగా నివేదిక ఇవ్వాలని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్పరాజ్ ను లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమ అనుమతులతో పాటు చోటు చేసుకున్న అనేక అక్రమాలపై దర్యాప్తు జరిపాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
