కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత
భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
తమ సమస్యలను ఎమ్మెల్సీ కవితకు వివరించిన భూనిర్వాసితులు
కొడంగల్ జూలై 31 (ప్రజా మంటలు):
కానుకుర్తి గ్రామంలో కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు.భూనిర్వాసితుల డిమాండ్లకు ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
భూ నిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టారని ,కేసీఆర్ దిగిపోయే నాటికి 95 శాతం ప్రాజెక్టు పనులు పూర్తఉందని,ఏనుగెళ్లింది తోకచిక్కిందన్నట్లు పరిస్థితి తయారైందనీ విమర్శించారు.
పాలమూరు బిడ్డ అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరిస్తున్నారు.ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ యే గుర్తుకొస్తారన్న ఉద్ధేశంతో రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులు పక్కనబెట్టారు
పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కరివేన ప్యాకేజీని రద్దు చేసి కొత్తగా కొడంగల్ లిఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడుతున్నారు. దాంతో కొడంగల్, నారాయణపేటలో 1.8 లక్షల ఎకరాల ఆయకట్టు నుంచి లక్ష ఎకరాలకు తగ్గింది
వాస్తవానికి కొడంగల్ ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవాల్సింది భూత్ పూర్ లింక్ కు ముడిపెట్టారు.బీమా ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుంటే మక్తల్ ప్రాంతానికి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది.కొడంగల్ ప్రాజెక్టు వల్ల మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతున్నది తప్ప లాభం జరగడం లేదు.
రూ 2900 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఒక స్పూన్ మట్టి కూడా తీయకుండానే, పనులు మొదలుకాకుండానే ప్రాజెక్టు వ్యయం రూ 4500 కోట్లకు పెరిగింది. అంచనా వ్యయం రూ 1500 ఎందుకు పెరిగింది ? ఎవరి కోసం పెరిగింది ?
ఆ పెరిగిన రూ 1500 కోట్లు పెద్ద వాళ్ల చేతికి వెళ్తున్నాయి. తట్ట మట్టి తీయకున్నా ఇద్దరు కాంట్రాక్టర్లకు ముందే రూ 600 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు.అడ్వాన్స్ ఇచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఇంకా పనులు మొదలుకాలేదు.
నిజంగా సీఎం పాలమూరు బిడ్డనే అయితే తక్షణమే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి. మరిన్ని ప్రాంతాలకు నీళ్లిందించే విధంగా కొడంగల్ ప్రాజెక్టును రూపకల్పన చేయాలి
భూనిర్వాసితులతో ప్రభుత్వం చర్చలు జరపాలి
భూమి విలువ ఎక్కువగా ఉన్నందున ఎకరానికి రూ 35 – 40 లక్షలు పరిహారం చెల్లించాలి.నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలను నిర్మించడమే కాకుండా భూమి కోల్పోయే వారికి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
సీఎం మాట అంటే జీవో లాంటింది... కానీ సీఎం ఎకరానికి 20 లక్షలు ఇస్తామంటే... రూ 14 లక్షలే ఇస్తామని అనడానికి అధికారికి ఎంత దమ్ముండాలి. ముఖ్యమంత్రి ఒక మాట... అధికారి ఒక మాట ఎలా చెబుతారు ?
ముఖ్యమంత్రి మాటకు విలువ ఉందా లేదా అన్నది ఆలోచించాలి.వరికి బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది రైతులక ఎగవేసింది.రైతు రుణమాఫీ 60 శాతం మందికి ఇంకా రానేలేదు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
