సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు
సికింద్రాబాద్ జూలై 17 (ప్రజా మంటలు):
సిప్‌అబాకస్ రీజనల్ ప్రోడిజీ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి పలు బహుమతులు గెలుచుకున్నారని పద్మారావునగర్ ప్రాంచైజీ నిర్వాహకురాలు అనురాధ రజనీకాంత్ తెలిపారు. ఈమేరకు గురువారం పద్మారావునగర్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. సిప్ అబాకస్ రీజనల్ ప్రోడిజీ–2025 పేరిట ఇటీవల కాంపిటీషన్ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు సెంటర్ల విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో పద్మారావునగర్ సెంటర్ విద్యార్థులు పలు మెడల్స్, ట్రోఫీలను గెలుచు కున్నారు. ఈ సందర్భంగా పద్మారావునగర్ సెంటర్ ఎల్‌సీఎల్ అనురాధ రజనీకాంత్ మాట్లాడుతూ...చిన్నారుల్లో మానసిక గణన నైపుణ్యాల మెరుగు, సంఖ్యా సామర్ధ్యాల అభివృద్ధి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మేధస్సు పెరుగుదలకు అబాకస్ ఎంతగానో దోహద పడుతుందన్నారు. విద్యారంగంలో కీలక మార్పులు, టెక్నాలజీలను చిన్నప్పటి నుంచి ఔపోషన పట్టేందుకు అబాకస్ ఓ కీలక సాధనమన్నారు. కార్యక్రమంలో కోర్స్ ఇన్‌స్ట్రక్టర్లు సుచరిత, కవిత, విద్య, సంఘమిత్ర లతోపాటు విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
