మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల రూరల్ జూలై17(ప్రజా మంటలు)
మండలంలోని లక్ష్మీపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.. నిన్న బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తిన్న విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు..
పాఠశాలలో 350 కి మంది పైగా విద్యార్థినిలు ఉండగా సుమారు 30 మంది అయితే కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు... అవస్థ పడుతున్న విద్యార్థులు అప్పటికే గురుకుల యాజమాన్యానికి సమాచారం అందించారు.గురువారం ఉదయం సైతం పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు లోను కాగా హుటాహుటిన జగిత్యాలలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు... అందులో నలుగురు విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు గుర్తించారు.. మిగతా విద్యార్థినిలకు పాఠశాలలోనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.. ఫుడ్ పాయిజన్ విషయం బయటకు పోకుండా యాజమాన్యం ఎంత జాగ్రత్త వహించిన...పిల్లల కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాలకు తరలిరావడంతో విషయం చెప్పక తప్పలేదు... గురుకులంలో ఫుడ్ పాయిజన్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఘటనపై విచారణకు ఆదేశించారు...
అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.. ఈ క్రమంలో పలువురు విద్యార్థినిల నుండి వివరాలు సేకరించారు... మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు.. నాన్ వెజ్ లో కారం అతి కావడం వల్లే గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తిందని ప్రిన్సిపల్ చైతన్య అంటుండగా అసలేం జరిగిందో తెలియాలి... మరోవైపు విద్యార్థిల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చారు.. తమ పిల్లలకు ఏమైందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంటికి తీసుకెళ్లారు.
మాత శిశు కేంద్రం లో విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్
కాగా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థినుల ఆరోగ్యం పై డాక్టర్ తో మాట్లాడిన అనంతరం చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారికి ఎలాంటి అపాయం లేదని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు పిల్లలు పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని అధికారులకు సూచించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
