విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా స్థాయి రెండవ పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ
జగిత్యాల జూన్ 20 (ప్రజా మంటలు)
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి అని ఆదేవిదంగా న్యాయ నిరూపణ జరగాలంటే సరైన,అధారాలు, నేర దర్యాప్తు చాల కీలకమైనదని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
డిజిపి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా స్దాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి ప్రారంభించారు. ఈ డ్యూటీ మీట్ లో పోలీస్ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి వివిద విబాగాలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్,హ్యాండ్లింగ్, ప్యాకింగ్ లిఫ్టింగ్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ విభాగాల్లో, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీల్లో విభాగాల వారిగా రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహించబడే పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక చేయడం జరుగుతుంద ని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు. అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానిక చక్కని వేదిక అన్నారు. ఈ యొక్క డ్యూటీ మీట్లో ఉత్తమ ప్రతిభ చూపాలని అన్నారు. జాతీయ స్దాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ విజేతలకు మంచి గుర్తింపు వుంటుందని అన్నారు. ప్రతిభ చూపిన వారికి రాష్ట్రాలు,జాతీయ స్ధాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ కు వివిధ ప్రాంతాల నుండి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సహం లభిస్తుందని అన్నారు. సంక్లిష్టమైన కేసులు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాలని కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీలు వెంకటరమణ,రఘు చందర్,రాములు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రఫీ ఖాన్, శ్రీధర్,సుధాకర్,కరుణాకర్,రవి,సురేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
