సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు
మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బోర్డు సీఈఓ మధుకర్ నాయక్...
సికింద్రాబాద్, జూలై 17 (ప్రజామంటలు) :
పరిసరాల పరిశుభ్రత, మౌళిక సదుపాయాల కల్పనపై కేంద్రప్రభుత్వం ఇచ్చే స్వచ్చ్ సర్వేక్షన్ మినిస్టీరియల్ అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ దక్కించుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన పత్ర్యేక కార్యక్రమంలో గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ కత్తార్ చేతుల మీదుగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ అందుకున్నారు. దేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డులలో స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు అందుకున్న ఏకైక బోర్డు. కంటోన్మెంట్లో చెత్త సేకరణ వాహనాలతో అన్ని వార్డులలో ఇంటింటికి తిరిగి 95 శాతం చెత్త సేకరణ, వ్యర్థాల సేకరణను రోజువారీ పర్యవేక్షణ, ట్రాక్ చేయడం, పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల పునరుద్ధరణ పరిశుభ్రతతో చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దారు.
మార్కెట్లు, బస్ స్టాప్‌లు, రవాణా కేంద్రాలు, అప్రోచ్ రోడ్లు , మతపరమైన ప్రదేశాలలో ఇంటెన్సివ్ క్లీన్సింగ్ డ్రైవ్‌లు నిర్వహించడం,యువజన సంఘాలు, ఎన్ఎస్ఎస్ , వాలంటీర్లు , కాలనీ సంఘాలతో క్రమం తప్పకుండా ప్లగింగ్ డ్రైవ్‌లు నిర్వహించడం, నీటి వనరుల పునరుజ్జీవనం, నాలాల పూడిక తీయడం, చెత్త తొలగింపు ,రామన్నకుంట సరస్సు పునరుద్ధరణ, భారీ చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. గత 2 సంవత్సరాలలో ప్రజా స్థలాలు, ఉద్యానవనాలు, సరస్సు తీరాలు , పాఠశాల ప్రాంగణాలలో మొక్కలు నాటే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. పరిసరాల పరిశుభ్రతపై బోర్డు పరిధిలోని అన్ని వార్డులలో 125 కంటే ఎక్కువ స్వచ్ఛతా ర్యాలీలు, 100కు పైగా వీధి నాటకాలు , 50 అవగాహన ప్రచారాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. - కంటోన్మెంట్ ప్రాంతం అంతటా సమర్థవంతమైన వ్యర్థ జల నిర్వహణ , మెరుగైన పారిశుధ్యాన్ని నిర్ధారించడానికి భూగర్భ పారుదల వ్యవస్థలు , ఓపెన్ నల్లాల శుభ్రపరచడం నిర్వహణ ముమ్మరంగా నిర్వహించామని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ , పచ్చదనం అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, సురక్షితమైన , మరింత స్థిరమైన పట్టణ వాతావరణ కలిగించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లుచెప్పారు. తమకు ఈ అవార్డు లభించడం చాలా గర్వంగా ఉందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
