బన్సీలాల్‌పేట లో కార్డన్ సెర్చ్
సికింద్రాబాద్,జూన్ 20 (ప్రజా మంటలు):
గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలో పోలీసులు శుక్రవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బన్సీలాల్ పేట్, సిసి నగర్ లోని పలు బస్తీల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 80 ద్విచక్రవాహనాలు, ఒక 4 వీలర్స్ సీజ్ చేశారు. అలాగే బెల్ట్ షాపు నుంచి తెచ్చి భద్రపరిచిన 32 బీర్బాటిళ్లు, 150 నిషేధిత పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా 8మంది అనుమానితులను , ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. ఇక నుంచి ఎప్పటికప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసి అవేర్ నెస్ కల్పిస్తామన్నారు. అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ కార్డన్ సర్చ్ లో గాంధీనగర్ డివిజన్ ఏసీపీ యాదగిరి,ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, డీఐ ఆర్. వెంకటేశ్వర్లు తో పాటు 250 మంది పోలీసులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు
