సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్
జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు)
ప్రతి సోమవారం " విద్యుత్ ప్రజావాణి" కార్యక్రమం నిర్వహిస్తున్నామని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ స్పష్టం చేశారు .
విద్యుత్ వినియోగదారులందరికి మరింత చేరువై వారి సమస్యల పరిష్కార ధ్యేయంగా ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం చేపట్టామని
వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు . 2024 జూన్ 17 న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు . ఇప్పటి వరకు " విద్యుత్ ప్రజావాణి" లో 706 ఫిర్యాదులు రాగా 600 పరిష్కరించామని తెలిపారు . వినియోగదారుల విద్యుత్ సమస్యలు ప్రధానంగా విద్యుత్ బిల్లుల సమస్యలు , మీటర్ల సమస్యలు , విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు , క్యాటగిరి మార్పు , పేరు మార్పు ప్రమాద భరింతగా ఉన్న స్థంబాలు తదితర విద్యుత్ ఫిర్యాదుల సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరించడానికి దోహద పడుతుందని తెలిపారు . అలాగే వారితో సత్ సంబంధాలు మరింత మెరుగు పడుతాయని అన్నారు . సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో అనగా సర్కిల్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో , సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు . డివిజన్ ఆఫీస్ , ఈఆర్వో, సబ్ డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ లలో "ప్రతి సోమవారం "ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు మరియు సర్కిల్ ఆఫీస్ లో అదే రోజు సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు .
విద్యుత్ ప్రజా వాణి కార్యక్రమన్ని పటిష్ట పరిచడంలో భాగంగా సమీక్షలు నిర్వహించి విద్యుత్ వినియోగదారులు చేసే ఫిర్యాదులను సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ."విద్యుత్ ప్రజావాణి" వినియోగదారులకు మరింత చేరువలో అయ్యి వారితో మమేకమై ఉద్యోగస్తులు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని వివరించారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
