రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం
సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజామంటలు):
:
పునరుత్పాదక ఇంధన రంగాన్ని పురోగమింపజేసే దిశగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం రాయ్‌బరేలీలో విశాకా ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ ను అధికారికంగా ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు హైదరాబాదులో మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమం భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మోబిలిటీ పరిష్కారాలను వేగవంతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు అని వారు అన్నారుఈ ప్రారంభ వేడుకలో, ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు మరియు ఆటమ్ ఈ-బైక్లను కూడా ప్రారంభించారు. ఈ పరిష్కారాలు విశాకా ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ అనుకూలమైన, ఆవిష్కరణాత్మక దృష్టిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ గడ్డం సరోజ, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గడ్డం వంశీ, లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..., పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
భారత్ ను గ్రీన్ ఎనర్జీ మార్గంలో ముందుకు తీసుకెళ్లడంలో ఆటమ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.ఆటమ్ సోలార్ రూఫ్ ప్రత్యేకత ఏమిటంటే — ఇది ఒకే సారి నాణ్యమైన రూఫింగ్ మెటీరియల్‌తో పాటు సౌరశక్తిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు వీటి ఆధారంగా స్వయం సమృద్ధి సాధించగలిగే పునరుత్పాదక విద్యుత్తును వినియోగదారులకు అందిస్తాయి,
దీనివల్ల విద్యుత్తు పై ఆధారపడకుండా, స్వచ్ఛమైన శక్తిని అందించవచ్చు అని అన్నారు. విశాకా ఇండస్ట్రీస్ తన ఆటమ్ శ్రేణి ఉత్పత్తుల ద్వారా పర్యావరణానికి మిత్రమైన పరిష్కారాలను సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
