శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
శృంగేరి ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి
వచ్చేనెల జరుప సంకల్పించిన 19 వ వార్షికోత్సవ ఏర్పాట్ల గురించి కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి తో పాటు పలు ప్రధాన ఆలయాల ను మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు ముందస్తు ఏర్పాట్లపై క్షేత్ర పర్యటన చేసినట్లు సంస్థ అద్యక్షులు, మహాదేవభట్ల లక్షణప్రసాద్ శర్మ కన్వీనర్ సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ, కార్యనిర్వాహక సభ్యులు గోర్ల గోవర్ధన శర్మ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ యలమంచి చంద్రశేఖర శర్మ నలుగురి సభ్యుల బృందము తెలిపారు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆదిశంకరాచార్య దక్షిణామ్నాయ శృంగేరి పీఠాని కి చేరుకుని శ్రీ శృంగేరి శంకరాచార్య శారదా పీఠాదీశ్వరులు శ్రీమత్పరమహంస పరీవ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారిని మరియు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించి సంస్థ సంకల్పించిన వార్షికోత్సవము శృంగేరి లో నిర్వహించాలనే విషయాన్ని వారికి తెలిపి
వారి ఆజ్ఞ తో
సంస్థ 19 వవార్షికోత్సవము శృంగేరి లో జరుపుటకు నిర్ణయం తీసుకున్నామని, కార్యక్రమానికి స్వామి వారి అనుగ్రహం లభించిందని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పాంచాహ్నిక దీక్షతో శత రుద్ర సహిత ఏక కుండాత్మక శతచండీ యాగము జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నామని అద్యక్షులు మహాదేవభట్ల లక్షణప్రసాద్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 350 మంది భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పాల్గోనున్నారని సంస్థ కన్వీనర్ సిరిసిల్ల రామ శర్మ , కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు మరియు యాగంలో పాల్గోనే 350 మంది భక్తులకు వసతి మరియు భోజన సౌకర్యాలకు శృంగేరి పీఠం వారిని సంప్రదించామని వారి సహాకారంతో యాగానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ యలమంచి చంద్రశేఖర శర్మ తెలిపారు,
అదేవిధంగా శృంగేరి తోపాటు చుట్టు పక్కల గల కుక్కి,ధర్మస్థల, ఉడిపి,మూకాంబిక,మురుడేశ్వర్ మరియు గోకర్ణ క్షేత్రాలను కూడా తమ వెంట వచ్చే భక్తులకు దర్శించే అవకాశం ఉంటుందని కార్యవర్గ సభ్యులు గోళ్ళ గోవర్ధన శర్మ ఈ సందర్భంగా ఒక ప్రతికా ప్రకటన లో తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
