సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విస్మయం - 2K25 వార్షికోత్సవ వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)
పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ వారి విస్మయం - 2025 వార్షికోత్సవ వేడుకలు స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ శ్రీమతి మంజుల రమాదేవి మరియు పాఠశాల డైరెక్టర్లు బియ్యల హరి చరణ్ రావు , జగిత్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడు బోయినపల్లి శ్రీధర్ రావు బాబు జగ్జీవన్ రావు జయంతి నీ పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి ,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ " నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపారు. విద్యార్ధి దశ లోనే కస్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు .యువత వివిధ బాధ్యతాయుతమైన పనులు చేపట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు . ప్రతి విద్యార్థి తాను అనుకున్న ఆశయాలు సాధించి ఆదర్శంగా ఉండాలని సెల్ఫోన్లకు , ఇతర వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని అని అన్నారు . ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన టెక్నాలజీ పరంగా విషయాలను తెలుసుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా అవసరమని మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల నృత్యాలు నాటికలు ప్రేక్షకులను అల్లరించాయి. ఛత్రపతి శివాజీ నాటిక ప్రత్యేకంగా ఆకట్టుకున్నది .ఇతిహాసాల గురించి తెలిపే వేంకటేశ్వర కళ్యాణం , నవ శక్తీ అమ్మ వార్లు, దేశభక్తిని కలిగించే విధంగా ఆర్మీ సాంగ్, పల్లె వాతావరణన్ని, ప్రకృతిని రైతుల గొప్పతనన్ని తెలిపే సాంగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ మరియు తండ్రి కొడుకుల అనుబంధం పైన చేసిన నృత్యాలు చూపరులను ఆలోచింప చేశాయి. తల్లి తండ్రులు వారి పిల్లల తో (ఫ్యామిలీ డాన్స్) చేసిన నృత్యం ప్రేక్షకులకు కనువిందు చేసింది. మహిళల కష్టాలు వారి అభ్యున్నతి గురించి చేసిన నాటిక చూపరులను కంటతడి పెట్టించింది .
ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, , మంజుల రమాదేవి ,మౌనిక రావు, రజిత , అజిత , సుమన్ రావు , ఉపాద్యాయ బృందం ,తల్లి తండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
