ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది
*సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో గ్రేట్.. *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు):
ఫ్యాషన్ వల్లే మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ సరోజ వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం సికింద్రాబాద్ పీజీ రోడ్డు లోని రబ్జ్యోతి బిల్డింగ్ ఫస్ట్ ప్లోర్ లో శ్రీవాసవి మహిళా సంఘం, స్ర్తీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ మణిద్వీపం నూతన కార్యాలయాల భవనాన్ని ఆమె ముఖ్య అతిధిగా హజరై, ప్రారంభించారు. ఈసందర్బంగా సరోజా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇల్లు, బడి, గుడి ఆడవాళ్లు ఎక్కడ అయితే గౌరవించ బడితే అక్కడ స్వర్గ స్వీమ ఉంటుందన్నారు. 80 శాతం మార్కులు సాధించిన స్టూడెంట్లకు అంబేద్కర్ విద్యా సంస్థల్లో ఫ్రీ స్పాన్సర్ ఇచ్చి చదివిస్తామని ప్రకటించారు. ఎక్కువగా ఈ మధ్య అమ్మాయిలు స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్నారని. కనీస అవసరాలైన వాష్ రూమ్ లు స్కూళ్ళల్లో సరిగ్గా ఉండట్లేదన్నారు. తమ అంబేద్కర్ కాలేజ్ లో తమ వాచ్ మెన్ కుతూరు కాలేజ్ టాపర్ గా నిలిచారన్నారు. ఆటో డ్రైవర్ అబ్బాయి స్టేట్ టాపర్ గా వచ్చారని, ఇది ఎంతో గొప్ప విషయమన్నారు. ఈసందర్బంగా వాసవి మహిళా సంఘ ప్రతినిధులు సరోజ వివేక్ వెంకటస్వామి ని ఘనంగా సన్మానించారు. సరోజ మేడం ను ఈ కాలం మహిళలు ఆదర్శంగా తీసుకొని,జీవితంలో ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు.
వాసవి మహిళా సంఘం సేవలు అభినందనీయం:
1976 లో స్థాపించబడ్డ హైదరాబాద్ శ్రీవాసవి మహిళా సంఘం, 35 ఏండ్ల క్రితం ఏర్పాటైన స్ర్తీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు ఎంతో గొప్పవని, నిర్వహకులు నిజంగా అభినందనీయులని సరోజ వివేక్ వెంకట్ స్వామి అన్నారు. వాసవి మహిళాసంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య నిధి, విద్యానిధి,కళ్యాణ నిధి, వృద్దాప్య నిధి,వికలాంగుల నిధి ఇలా ఐదు నిధులను ప్రత్యేకంగా కేటాయించి, నిరుపేదలను ఆదుకుంటున్నారని అన్నారు.ఇవే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయలను భవిష్యత్ తరాలకు అందించే విదంగా, బతుకమ్మ పండుగ, వనబోజనాలు,చిల్ర్డన్స్ డే,ఎంటర్నైట్మెంట్ ఈవెంట్స్, కల్చరల్ ప్రొగ్రామ్స్,తంబోలా నిర్వహిస్తున్నారని అన్నారు. స్ర్తీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ ద్వారా తెలంగాణ పిండి వంటలను చేస్తూ, ఎందరో మహిళలకు ఉపాధి కల్పించడం గ్రేట్ అని అన్నారు. వాసవి మహిళా సంఘం ప్రెసిడెంట్ మ్యాడం కళాప్రియ,జనరల్ సెక్రటరీ న్యాల మడుగుల మౌష్మి గుప్తా, ట్రెజరర్ కోటగిరి కృష్ణకుమారి, స్ర్తీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ అద్యక్షులు ప్రొద్దుటూరి శివకుమారి,జనరల్ సెక్రటరీ తటవర్తి విజయలక్ష్మీ, ట్రెజరర్ మోది రాజేశ్వరీ, ప్రాజెక్ట్ చైరపర్సన్ ఉప్పల శారధ, అడ్వయిజర్స్ డా.అనంతలక్ష్మీ సాలికె, కొట్రికె విజయ,సోమ నాగవర్థిని పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
