ఘనంగా అయ్యప్ప స్వామి జయంతి వేడుకలు
సికింద్రాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని బన్సీలాల్ పేట్ డివిజన్ వాస్తవ్యులు మణికంఠ బ్రదర్స్, గొల్ల కొమరయ్య కాలనీ ప్రధాన కార్యదర్శి ఈ. నర్సింగరావు, కోశాధికారి వినోద్ కుమార్, ఈ మనీష్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆధ్యాత్మిక భావనతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని రవీందర్ యాదవ్ (స్కైలాబ్) విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా షాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
వీరితోపాటు గోల్డ్ మాన్ దర్గా శ్రావణ్, జిహెచ్ఎంసి నార్త్ జోన్ మాజీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి నార్త్ జోన్ మాజీ రిటైర్డ్ అధికారి గంగాధర్ రెడ్డి, జిహెచ్ఎంసి రిటైర్డ్ ఏసిపి రాజేందర్ కుమార్ యాదవ్, ఏసీపీ రమణ, జిహెచ్ఎంసి బి. ఎం.ఈ.యు యూనియన్ సభ్యులు అశ్రఫ్ అలీ, ప్రకాష్, గోపాల్ కృష్ణ, లక్ష్మీనారాయణ బాలరాజ్, తోపాటు బిఈఈ చైర్ పర్సన్ భావిక్ భాయ్, స్థానిక కార్పొరేటర్ హేమలత, విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రచారాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానిక భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని సుమారు 2500 మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... మణికంఠ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహత్తర కార్యక్రమం అయ్యప్ప స్వామి జన్మదినం వేడుకకు విచ్చేసిన ముఖ్య అతిథులకు భక్తులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ప్రతి సంవత్సరం ఇదే విధంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఆయన జన్మదిన నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు ఆనందాన్ని వ్యక్తపరిచారు. నీలకంఠ భజన మండలి చేసిన అయ్యప్ప స్వామి భజన పాటలు భక్తులను అలరించి ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
