పవిత్రమైన వైద్య వృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలి
కాళోజీ హెల్త్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి
ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ 2019 గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు) :
ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిని నైతిక విలువలతో నిర్వహించాలని, ఇందులో వృత్తి నిబద్దత, ఓపిక,ప్రశాంతత ఎంతో అవసరమని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పీవీ నందకుమార్రెడ్డి అన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ 2019 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రోగులతో ప్రేమగా వ్యవహరించాలని, ఆప్యాయంగా వారితో మాట్లాడాలని సూచించారు.
పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను, ఎంబీబీఎస్ పూర్తి చేసిన 2019 బ్యాచ్ కు చెందిన 245 మంది వైద్య విద్యార్థులందరికీ డాక్టర్ పట్టాలను అందజేసి, అభినందనలు తెలిపారు. 1973 బ్యాచ్ లో గాంధీ మెడికల్ కాలేజీలో తాను చదువుకున్నానని, ఈరోజు వైస్ ఛాన్స్ లర్ హోదాలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉన్నదన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధన చేయడానికి ముందుకు వస్తే తమ యూనివర్సిటీ ద్వారా వారికి తగిన నిధులను అందించి ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్ లో ఉన్న హెల్త్ యూనివర్సిటీ బ్రాంచ్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కళాశాల ఖ్యాతిని నూతన డాక్టర్లు మరింత పెంచే విధంగా నడుచుకోవాలని ఆయన అన్నారు. వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి గతంతో పోలిస్తే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదని అన్నారు. దానిని ఉపయోగించుకుని మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఆదిలాబాద్ జిల్లా, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ ప్రజలు వైద్యం కోసం పట్టణానికి రావాల్సి వచ్చేదని అన్నారు. 33 జిల్లాలలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు ఆయ్యాయని అన్నారు. ముఖ్యంగా కరోనా రెండు దశల్లో గాంధీ ఆసుపత్రిలో లక్షలాదిమందికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారని, అందుకు పనిచేసిన వైద్యులు సిబ్బందిని అభినందిస్తున్నామని అన్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. ఇందిరా మాట్లాడుతూ 2019లో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 245 మంది విద్యార్థుల్లో 95% ఉత్తీర్ణత సాధించారని అన్నారు.
మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ద్వారా తమ కళాశాలకు చెందిన డాక్టర్ దుర్గం కావ్య గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం అన్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి.హెచ్.ఎన్.రాజకుమారి మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న తాజా మార్పులను నూతన డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గాంధీ వైద్య కళాశాల ప్రతిష్టను మరింత చేసే విధంగా వైద్య సేవ అందించాలని ఆమె సూచించారు. అనంతరం నూతన డాక్టర్ల చేత ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల హెచ్ఓడి లు డాక్టర్ బి వాల్యా, డాక్టర్ రాజారామ్, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ మురళీధర్, గాంధీ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ లింగమూర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్,జూడా ప్రెసిడెంట్ డా.అజయ్, మహ్మాద్ ఫారుఖ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
