ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags

More News...

Local News  State News 

బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు - అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి- భక్తులతో కిక్కిరిసిన ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసరాలు - పోలీసుల భారీ బందోబస్తు సికింద్రాబాద్, జూలై 13 (ప్రజామంటలు): లష్కర్ లో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్త జన కోటి...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు) తీన్మార్ మల్లన్న ఒక ప్రజాస్వామ్య పదవిలో ఉన్నావు నోరు  జాగ్రత్తగా పెట్టుకోకవితక్క కి ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలికల్వకుంట్ల కవితక్క పై అనుచిత వాక్యాలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో జగిత్యాల నియోజకవర్గం మహిళ...
Read More...
Local News 

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి    వేములకుర్తి గ్రామంలో కోట శ్రీనివాసరావు మృతి నివాలి లో  తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి ఇబ్రహీంపట్నం జూన్ 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పదశ్రీ అవార్డు గహిత,విలక్షణ సీనియర్ సినీ నటుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు ప్రజల మదిలో అయన  చిరస్మరణీయం గా తెలుగు ప్రజల గుండెల్లో...
Read More...
National  Filmi News  State News 

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. హైదరాబాద్ జూలై 13: విలక్షణ నటుడు, 750 చిత్రాలలో నటించిన కోట శ్రీనివాస్ రావు (1942 జులై 10 - 2025 జులై 13) కన్నుమూశారు..  కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు.. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు.. ఆహా నా పెళ్లంట...
Read More...
Local News 

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

మాజీ మంత్రి రాజేశం గౌడ్  మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో  విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు జగిత్యాల జులై 12(ప్రజా  పట్టణంలో శ్రీ వాల్మీకి ఆవాసం సేవ భారతి లో మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్  మనుమరాలు సమీరా 8వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒక రోజు భోజనం వసతి కల్పించగా ముఖ్య అతిథిగా హాజరై   ఆవాసం విద్యార్థులకు భోజనం వడ్డించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ...
Read More...
Local News 

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ జూలై 12 (ప్రజామంటలు): బోనాల పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కింద సికింద్రాబాద్  నియోజకవర్గం  పరిధిలోని 212  దేవాలయాలకు రూ కోటి 12  లక్షల రూపాయలను ప్రభుత్వం చెక్కుల రూపంలో అందజేసింది ఈ మేరకు శనివారం  సీతాఫల్మండి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ సలహాదారుడు వేం...
Read More...
Local News 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.     -టీబీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.    జగిత్యాల జులై 12: విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం పట్ల  టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో టీ బీసీ జేఏసీ జిల్లా శాఖ...
Read More...
Local News 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి 

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి  గొల్లపల్లి (ధర్మపురి) జూలై 12 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధోనూర్ చెందిన గొల్లెన రవి, గొల్లెన నాగరాజుల కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలు నుండి పక్క పక్కన నివసిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఇంటి స్థలం గెట్టు  విషయంలో గొడవలు జరుగుతున్నప్పటికీ ఈమధ్య మృతుడు గోల్లెన రవి, కొత్త ఇంటి  ఇంటి నిర్మాణం  చేపట్టి...
Read More...
Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపై దాడి – బంగారం, నగదు అపహరణ వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు)నెక్కొండ మండలంలోని పనికర గ్రామం అవతల ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలో శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దొంగతనానికి...
Read More...

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు    గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు వేలేరు, ప్రజామంటలు:గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తుది సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, భూ నిర్వాసితులకు ఎదురవుతున్న ఏవైనా సమస్యలు ఉంటే, అవి అర్జీ రూపంలో సమర్పించాలని తెలిపారు....
Read More...
Local News 

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు    జగిత్యాల  జూలై 11 ( ప్రజా మంటలు) ఆషాడమాసం శుక్రవారం సందర్భంగా పట్టణం లోని పురాణిపేట  శ్రీ లోకమాత (గాజుల) పోచమ్మ తల్లి ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో మహిళలు పాల్గొని గోరింటాకు సంబరాలు  జరుపుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి  ఆశీస్సులు కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని  కోరుకున్నారు....
Read More...
Local News 

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్    మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు) మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్...
Read More...