రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది దసరా ఉత్సవం..
మెట్టుపల్లి సెప్టెంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వివేకానంద బస్తి (కళానగర్, రాంనగర్, ఆదర్శనగర్) దసరా ఉత్సవాన్ని మరియు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు కార్యక్రమాన్ని స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ కళానగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్తి గణేవేష్(ఆర్.ఎస్.ఎస్. డ్రెస్)తో 108 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిని సభ్యులు బూర్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ.......
దేశ ఐక్యత కోసం,ఆర్ఎస్ఎస్ ను డాక్టర్ హెడ్గేవార్ 1925 సం.లో దసరా నాడు ఆర్ఎస్ఎస్ ప్రారంభించారని దేశంలో నిత్యశాఖ ద్వారా అనేకమంది స్వయం సేవకులను దేశభక్తులుగా యువకులను తయారు చేస్తూ జాతీయ వాద సిద్ధాంతం ద్వారా నిత్యం నిరంతరం దేశంలో ఈ ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు.
ఆర్ఎస్ఎస్ దేశంలో ఒక లక్ష 50 వేల బస్తీలలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను గత 100 సంవత్సరాలుగా చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక మత సంస్థ కాదని ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక పునర్జీవం కోసం కృషి చేస్తున్న సంస్థని వారు చెప్పారు. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులను నిత్యం శాఖ ద్వారా తయారు చేస్తుందన్నారు.ఇలా తయారు కాబడిన స్వయం సేవకులు వివిధ రంగాల్లో ఈ దేశం కోసం కృషి చేస్తున్నారన్నారు.
విద్యార్థుల కోసం ఏబీవీపీ రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్ సరస్వతి శిశు మందిరాలు, విశ్వహిందూ పరిషత్ హిందూ వాహిని మొదలగు వివిధ క్షేత్రాలు నిత్యం దేశ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాయన్నారు.
దేశంలో వరదలు భూకంపాలు వచ్చినప్పుడు స్వయం సేవకులు నిస్వార్ధంగా అక్కడికి వెళ్లి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు అన్నారు.
ఈ కార్యక్రమానికి డా.వెంకటేశ్వర్లు,వివేకానంద బస్తీ ప్రముఖ్ పోతు లక్ష్మణ్,ప్రాంత సహా సద్భావన ప్రముఖ్ గోనె భూమయ్య,మెట్టుపల్లి నగర కార్యవాహ మామిడాల శివ కళ్యాణ్,జిల్లా వ్యవస్థ ప్రముఖ్ వీర్ల వెంకటేశ్వర్లు,
పాలోజీ మహేష్ చారి,చిట్యాల శ్రవణ్ ఆర్య,మంగ అరుణ్, బెజ్జారపు మురళి,గుర్రాల ప్రేమ్ కుమార్,ఎనగందుల హనుమాన్లు, పొహరు తుకారం తదితర స్వయం సేవకులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
