బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)
ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణం పోలీస్ స్టేషన్ లో వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో బ్యాంకుల, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... బ్యాంకులు, ఎటిఎంల వద్ద పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు తూచ తప్పకుండా పాటించాలని, ATM కేంద్రాల వద్ద కచ్చితంగా గార్డును నియమించాలని సూచించారు. ప్రతి బ్యాంకు, ATM ల వద్ద నిరంతరం సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాదాపు బ్యాంకులు, ఏటీఎంలలో అధిక నాణ్యత లేని సీసీ కెమెరాలు ఉన్నాయని, చాలా బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని ఈ సమావేశం అనంతరం అన్ని ఎటిఎంలలో, బ్యాంకులలో అలారం సిస్టమ్‌లతో పాటు సిసిటివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
బ్యాంక్,ATM ల వద్ద ఏదైనా అనుకోని సంఘటన జరిగిన సమయంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలో దాని పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. లోపలికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేయడానికి గార్డు ను బ్యాంకు ప్రవేశ ద్వారం నియమించాలని సూచించారు.సెక్యూరిటీ గార్డును బ్యాంక్ లేదా సెక్యూరిటీ ఏజెన్సీ నియమించినప్పటికీ, అతని వ్యక్తిగత సమాచారం యొక్క పూర్తి రికార్డు, అతని ఫోటోతో పాటు, బ్యాంక్ వద్ద ఉంచాలని సూచించారు.
కొత్తగా నియమితులైన వారు లేదా తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడిన వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చాలా నేరాలలో నిందితులు సీసీటీవీ లపై స్ప్రే చేసి సిసిటివిలు పని చేకుండా చేసి దొంగాతలకు పాల్పడుతారు అదేవిధంగా DVR లను దొంగిలించి నాశనం చేయడం చేస్తారు కావున DVR లను కనిపించేలాగా కాకుండా సీక్రెట్ ప్రాంతాలలో ఉంచాలని సూచించారు.
ATM లలో డబ్బులు ఫీల్లింగ్ సమయంలో స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలోని బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి బ్యాంకు అధికారులకు, సిబ్బందికి బ్యాంకు ఉన్న ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారుల నెంబర్ లు తెలిసి ఉండాలి. హెల్ప్‌లైన్ మరియు పోలీస్ స్టేషన్‌ల సంప్రదింపు నంబర్‌లను బోల్డ్ అక్షరాలతో వ్రాసి బ్యాంకు లోపల తగిన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు, దొంగలు ఎక్కువగా బ్యాంకులు రోజు తెరిచినప్పుడు లేదా మూసివేయబడిన సమయంలో మరియు వారి భోజన విరామ సమయంలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టి ఈ సమయంలో సెక్యూరిటీ గార్డుతో పాటు బ్యాంకు ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఏదైనా ప్రమాదకరమైన సంఘటన జరిగినప్పుడు డయల్ 100 కు ,స్థానిక పోలీస్ కి సమాచారం అందించాలని అన్నారు.బ్యాంకుల నుండి బంగారం ,డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళే వాళ్ళను లక్ష్యంగా చేసుకుని, వారిని అనుసరించి దొంగతనలు చేస్తున్నారని వీటిని నివారించడానికి బ్యాంకు బయట వాహనాలు నిలిపే ప్రాంతాలలో కూడా సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయం లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ లను ఆకస్మికంగా వారి పనితీరు ను తనిఖీ చేయాలని బ్యాంకు మేనేజర్లకు సూచించారు.
ఈ సమావేశం లో టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్.ఐ కుమారస్వామి బ్యాంకు అధికారులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)