ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమ విమర్శ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 19 (ప్రజామంటలు) :
బల్కంపేట నుంచి బేగంపేట్ వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జి కింద వరదల్లో చిక్కుకొని ఓ యువకుడు చనిపోగా, పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోట నీలిమ స్పందించారు. ఈమేరకు శుక్రవారం ఆమె ట్రాఫిక్ పోలీస్ అధికారులు,స్థానిక నాయకులతో కలసి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద పర్యటించారు.
హైదరాబాద్ మహా నగరంలో వరద నీరు నిలువ కాకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగానే బల్కంపేట పరిధిలోని అండర్ పాస్ బ్రిడ్జి కింద వచ్చి చేరుతున్న వరద నీరును సైతం హైడ్రా మోటార్లు పెట్టి తొలగిస్తోందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అధికారులు రాత్రింబవళ్ళు పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఐతే వరదల్లో ఇటీవల యువకుడు మరణించడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులకు చురకలు అంటించారు. ఓ వైపు ప్రజలు వరదలతో బాధపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం కానీ రాజకీయం కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి వరదలను నియంత్రించిందన్నారు. వరదల్లో చిక్కుకున్న జనాన్ని కాపాడటం కోసం వెళ్తే అక్కడ కూడా వారి కార్యకర్తలను ఉసిగొల్పి పనులకు అడ్డం పడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతల రాజకీయాల వల్ల ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వరదల్లో మరణించిన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్య గ్లోబల్ పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు

దుర్గా నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష,1000/ రూపాయలు జరిమాన

హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

బ్యాంకులు, ఎటిఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి: డీఎస్పీ రఘు చందర్

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
.jpg)
గతించిన మనిషి - గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు- అజాత శత్రువు నిజాం వెంకటేశం

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ప్రతిభ కనబరిచిన సహస్ర

ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షునితో చాంద్ పాషా భేటీ

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం...రాజకీయం కాదు..

గాంధీలో ఈఎన్ టీ వైద్యుల రాష్ట్రస్థాయి మహా సదస్సు
-(1).jpg)