సికింద్రాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా అరెస్ట్
రూ.8.47 లక్షల విలువ చేసే 16.95 కిలోల డ్రై గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఇద్దరు నిందితుల నుంచి రూ 8.47 లక్షల విలువ చేసే 16.95 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ జావేద్,ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ లు తెలిపిన వివరాలు...ఢిల్లీకి చెందిన చంద్రప్రకాశ్(22)కోల్కతా కు చెందిన జమీలా ఖతూన్ (19) అనే ఇద్దరు స్నేహితులు. వీరు గంజాయిని రవాణా చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పరాన్ ఖాన్ నుంచి గంజాయి కొనుగోలు చేసేవారు.
కిలో గంజాయిని రూ 1200 కొనుగోలు చేసి ఢిల్లీలో చిన్న పాకెట్లుగా అమ్మితే నాలుగురేట్లు లాభం వస్తుందని ఆలోచించారు. ఇందుకు కావాల్సిన రూ 20వేలలో చేరిసగం పెట్టుబడిగా పెట్టారు.ఇద్దరు కలిసి యూపీఐ ద్వారా డబ్బులు పంపి, 16 కిలోల గంజాయిని బుక్ చేశారు. సెప్టెంబర్ 10న ఢిల్లీ నుంచి విజయనగరం వెళ్ళి గంజాయి తీసుకొచ్చి, విశాఖ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు చేరుకున్నారు. తర్వాత ఢిల్లీ వెళ్ళాలను కున్నారు. సెప్టెంబర్ 11 న ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొని, ఢిల్లీకి వెళ్ళే రైలు కోసం ఎదురు చూస్తూ వెయిటింగ్ హాల్ లో గంజాయి సంచులతో ఉండగా, ఉదయం వారిని రైల్వే పోలీసులు గుర్తించి, పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్ లో ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్,ఎస్ఐ సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే ఎస్పీ చందనాదీప్తి,డీఎస్పీ జావేద్ లు వీరిని అభినందించి , రివార్డులను ప్రకటించారు.
––
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
