మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్
జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్ లో అమరత్ మిలాత్ ఈ ఇస్లామియా ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ అవార్డులు అందజేశారు. మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ...మహిళలను విద్య ఉద్యోగ అవకాశాలలో ముందుకు తీసుకెళ్లాలని మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు.
విద్య లేని మహిళలు బయటకు వచ్చి పని చేసుకోలేని వారికి ఇంటి వద్దనే ఇలాంటి ఉపాధిని కల్పించే ఆలోచన చేయాలని,జగిత్యాల పట్టణంలో 8 మైనార్టీ స్కూల్స్ ఏర్పాటు చేశాను వాటి అన్నిటికి సొంత భవనాలు నిర్మించను జగిత్యాల పట్టణంలో స్వంత భావనాలలో విద్య బోధనను అందింపచేసుకోగలుగుతున్నామని అన్నారు.
స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ మతపరమైనవి కావని, కొన్ని రాజకీయ పార్టీలు ప్రజులను తప్పుదోవ పట్టిస్తున్నాయని,కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని మాట్లాడుతున్నారు కానీ ముస్లింలకు 4 శాతం మరియు నూతనంగా వచ్చేది 1.8 కలిపితే కేవలం 5.8 శాతం మాత్రమే వస్తుంది అని జీవన్ రెడ్డి అన్నారు
అందులో కూడా గ్రామాలలో ముస్లింలు సర్పంచ్ గా ఎంపీటీసీగా ఉన్నది నేను చూడలేదువిద్య ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ కల్పిస్తే మాత్రమే ముస్లిములకు 5.8 రిజర్వేషన్ వస్తుందని అన్నారు
జగిత్యాల పట్టణ అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అందుబాటులో ఉంటానని పేదల అభ్యున్నతికి ఎల్లప్పుడూ సేవ చేస్తానని జీవన్ రెడ్డి అన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
