వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు):
ఈస్ట్ జోన్ పరిధిలోని వారసిగూడా పోలీసులు ఆటెన్షన్ డైవర్షన్ నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్ సెట్, ఒక వీవో మొబైల్, రూ.4,300 నగదు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్ కు చెందిన మటన్ షాప్ వర్కర్ గౌస్ ఖాన్ అలియాస్ ఆఫ్తాబ్ ఖాన్ (33) ఆగస్ట్ 26న సాయంత్రం మాస్క్, హెల్మెట్ ధరించి చేతిలో వైర్లెస్ తో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారిగా నటిస్తూ రాంనగర్ లోని వైఎస్ఆర్ పార్కు సమీపంలోని ఓ మటన్ షాప్ లోకి వెళ్ళాడు. అక్కడ కార్మికుడిని బెదిరించి రెండు బుచర్ కత్తులు, రూ 4,300 నగదును దొంగిలించాడు. బాధితుడు ముషీరాబాద్ కు చెందిన బాధితుడు ఇబ్రహీం ఫిర్యాదు మేరకు వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.
ఆగస్ట్ 31న వారాసిగూడ ఎక్స్ రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ బి.బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో వారాసిగూడ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ పురేందర్ రెడ్డి, ఎస్ఐలు గోపాల్, సుధాకర్,సిబ్బంది కేసును చేధించారు. వీరిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
