ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.
జగిత్యాల ఆగస్టు 31(ప్రజా మంటలు)
సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత చేతుల మీదుగా వాల్మీకి ఆవాసానికి 60 క్వింటాళ్ల బియ్యాన్ని 74 మంది దాతలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చక్కటి వసతి, భోజనం ఇతర సదుపాయాలు కల్పించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అన్నారు. వాల్మీకి ఆవాసానికి తమ వంతు సాయంగా ప్రతి సంవత్సరం పిల్లలకు అవసరం అయిన బియ్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన శాశ్వత బియ్యం దాతల సభ్యులను అదనపు కలెక్టర్ అభినందించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తారని అలాంటి వారందరికీ సహాయం అందించడం ఏ ప్రభుత్వాల వల్ల కూడా సాధ్యం కాదన్నారు.
సమాజంలోని అందరి అవసరాలను ప్రభుత్వాలు కొంతమేరకే తీర్చే అవకాశం ఉంటుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన ఇలాంటి దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్య ద్వారానే పేదరికంతోపాటు సమాజంలోని అనేక రుగ్మతలను రూపు మాపవచ్చన్నారు. గత 32 సంవత్సరాలుగా సామాజిక స్పృహ కలిగిన దాతల సహకారంతో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు భారతీయ సంస్కృతి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస అధ్యక్షులు జిడిగే పురుషోత్తం, ఆవాస కోశాధికారి సిరిపురం శ్రీనివాస్, ఎలగందుల కైలాసం, సభ్యులు అశోక్ రావు, సంపూర్ణాచారి, గౌరీశెట్టి హరీష్, గుండా సురేష్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ తో పాటు శాశ్వత బియ్యం దాతలు నూనె శ్రీనివాస్, వావిలాల శేఖర్, దువ్వ రాజు, ఉత్తూరి ఈశ్వర్,యాంసాని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్
