విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.
పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారులు
మెట్టుపల్లి ఆగస్టు 29(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో చాలీచాలని వేతనము కోసం తనకు కరెంటు పని నేర్చుకొని తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగులను గత నాలుగు సంవత్సరాలు క్రితం తీసుకోగా అందులో తాత్కాలిక ఉద్యోగిగా హరీష్ నియమితులయ్యారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన సాంబరి చంద్రశేఖర్ - భులక్షి దంపతులు రోజువారి కూలీలు కాగ వారి కుమారుడు సాంబరి హరిష్ తాత్కాలిక ఉద్యోగిగా పనులు చేస్తు జీవిస్తున్నారు. హరీష్ (31) కు కరెంట్ షాక్ తగలడంతో కుటుంబం రోడ్డున పడ్డదని,విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మెట్ పల్లి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.....జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామం విధ్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో మెట్ పల్లి పటణనికీ చెందిన హరీష్ విధ్యుత్ సహయక తాత్కాలిక ఉద్యోగి(అన్మాన్ గా) ఐదు సంవత్సరాలుగా విదులు నిర్వహిస్తూ జూన్ 12 న బర్దిపుర్ గ్రామంలో విధ్యుత్ అంతరాయం పనులు చేస్తూండగా కరెంట్ షాక్ తగిలి కరెంటు పోల్ పై నుండీ పడి గాయలవ్వడంతో గ్రామస్థులు క్షతగాత్రుని మెట్ పల్లి పటణంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ రేణ అసుపత్రికి తరలించారని అన్నారు.రెండు నెలలు వైద్యం తీసుకున్నాక రెండు కాళ్లు ఆ చేతనంగా మారి మంచానికే పరిమితం అయ్యాడని అన్నారు.
విద్యుత్ అధికారులు నామమాత్రంగా సందర్శించి చేతులు దులుపుకున్నారని అన్నారు.డ్యూటీ టైం అయిపోయిన తర్వాత లైన్మెన్ ప్రాంక్లిన్ విధులకు తీసుకువెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు.విధులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి కింద పడిన నన్ను లైన్మెన్ ప్రాంక్లిన్ పట్టించుకోలేదని హరీష్ అన్నారు. ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్న ఏ ఒక్క అధికారి తనని పరామర్శించలేదని అన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి దయనీయంగా ఉందని, తనకు భార్య,17 నెలల కూతురు కలదని తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నానని హరీష్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
