ప్రపంచ చంపియంగా నిలిచిన చికిత తానిపర్తికి సీఎం అభినందనలు
హైదరాబాద్ ఆగస్ట్ 26 (ప్రజా మంటలు):
కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అండర్ 21 కేటగిరీ ఫైనల్ లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్‌పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుని చికిత వరల్డ్ చాంపియన్‌గా నిలవడం దేశానికే గర్వకారణమని అన్నారు.
ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలన్న చికిత సంకల్పం యువతీ యువకులకు స్ఫూర్తిదాయమని అన్నారు. ఆటుపోట్లను తట్టుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్చరీలో రాణించిన చికిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచి చికితలోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
