మైనర్ బాలుని అక్రమ నిర్బంధంపై వ్యక్తిగతంగా హాజరుకావాలని హక్కుల కమీషన్ నోటీస్
హైదరాబాద్ ఆగస్ట్ 07:
జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో, మైనర్ బాలుని అక్రమ నిర్బంధన మరియు థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో హైదరాబాద్ నగర కమీషనర్ వారికి వ్యక్తిగత హాజరు కై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశం జారీచేసింది.
ఫిర్యాదుదారుడు దగ్గుపాటి రాంబాబు (HRC నం. 2901/2025) తన 17 ఏళ్ల కుమారుడు దగ్గుపాటి అజ్తి కుమార్ శర్మను 15.12.2024 నుండి 17.12.2024 వరకు జూబ్లీ హిల్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించి, దారుణంగా హింసించారని చేసిన ఆరోపణలను కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన తెలంగాణ మానవ హక్కుల కమిషన్,తీవ్రంగా పరిగణించింది.
పోలీసుల హింస కారణంగా బాధితుడు నడవలేని పరిస్థికి గురైనట్లు నివేదించబడిన బాధితుడి ఆరోగ్య పరిస్థితిని గమనించిన కమిషన్, సంబంధిత అధికారి ఇప్పటివరకు కమీషన్ కు ఎటువంటి నివేదికను సమర్పించలేదు. కాబట్టి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వారిని ఈనెల 12న రికార్డులతో తమముండు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.
హైదరాబాద్‌లోని NIMS మెడికల్ సూపరింటెండెంట్‌ను బాధితుడిని వెంటనే పరిశీలించి అవసరమైన చికిత్స అందించాలని, 48 గంటల్లోపు వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
