పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు
జగిత్యాల జూలై 31(ప్రజా మంటలు)
రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలపై పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలని రాష్ట్ర సిసిఎల్ఎ.. కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు లు ఆయా జిల్లా కలెక్టర్ లను ను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన (రీ-సర్వే) పై గురువారం రాష్ట్ర సిసిఎల్ఎ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), బీ ఎస్ లత ఆర్డీవో మధుసూదన్, ఏడి ఎస్ & ఎల్ ఆర్ ఎస్ బీర్పూర్ తహసీల్దార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికారులకు పలు, సూచనలు సలహాలు అందజేశారు. బీర్పూర్ మండలం కొమనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద (రీ-సర్వే)కు సంబంధించి తీసుకున్నామని తెలిపారు. రీ సర్వే చేసిన పట్టాదారుల వివరాలు.. పహానీలోని వివరాలు ఎంక్వైరీ చేసి 2 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ. సర్వే సిబ్బందికి ఫీల్డ్ వెళ్ళి విచారణ జరిపి రిపోర్టు సమర్పించాలని సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులు పూర్తి పారదర్శకంగా.. చట్టం ప్రకారం.. నిబంధనల మేరకు వ్యవహరించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించినా అధికారులదే పూర్తి బాధ్యత అని.. ఇందుకు బాధ్యతయుతంగా పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని కమిషనర్ పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
