ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు):
మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక కుంకుమార్చన, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రలు మహిళలు పాటించారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు నిలిచింది. మధ్యాహ్నం సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ ఎర్ర పోచమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారు అని కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారం చేసే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఎర్ర పోచమ్మ తల్లి ఆలయనీ కీ విచ్చేసే భక్తులు నమ్ముతారని అన్నారు.
ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మీడియా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు కే. కృష్ణ, కే.లత, పి.గంగాభవాని, బి.నీరజ, బి.మాధవి, పి.కృష్ణవేణి, పి.శ్రావణి, పి.సమంత, పి.రూప, వై.సౌజన్య, పి. ప్రభావతి, జి.శోభా, రాజేశ్వరి, సోనీ, రూప, అమ్ములు, తోపాటు సీనియర్ జర్నలిస్ట్ పుల్లూరు మహేంద్ర, డివిజన్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్, ఎల్. వెంకటేశం (రాజు), దేశపాక శ్రీనివాస్, అనిల్,
పి.జగదీష్ గౌడ్, వి. ప్రవీణ్ కుమార్, జె.నర్సింగరావు, పి.అశోక్ గౌడ్, జి.సందీప్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
