కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం
దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ
- డాక్టర్ బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్జరీ సక్సెస్
సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు):
కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో వైద్యులు ఆరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 27 సంవత్సరాల యువకుడికి ప్రమాదంలో భుజం ఎముక విరిగిపోయి, భుజం కదపలేని పరిస్థితిలో బాధపడుతూ చికిత్స కోసం కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రికి వచ్చాడు. యువకుడికి డోనర్ ఎముక గ్రాఫ్ట్‌ను ఉపయోగించి రివర్స్ షోల్డర్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఈ అధునాతన భుజం మార్పిడి శస్త్రచికిత్స మొట్టమొదటిది అని వైద్య నిపుణులు తెలిపారు.
రోగి భుజం పైభాగపు చేతి ఎముక (ప్రాక్సిమల్ హ్యూమరస్) విరిగిపోవడం మరియు ఎముక పూర్తిగా దెబ్బతింది, దీంతో భుజం కలప లేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి కేసులు ముఖ్యంగా యువ రోగులలో చికిత్స చేయడం చాలా క్లిష్టమైనది. సమగ్రంగా పరిశీలించిన అనంతరం, డాక్టర్ బి. చంద్రశేఖర్ నాయకత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స వైద్యుల బృందం, ప్రాక్సిమల్ హ్యూమరస్ అలోగ్రాఫ్ట్‌తో కలిపి రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు – ఈ ప్రక్రియలో సర్టిఫైడ్ బోన్ బ్యాంక్ ద్వారా పొందిన డోనర్ ఎముక టిష్యూ ద్వారా దెబ్బతిన్న భాగాన్ని పున నిర్మించారు. షోల్డర్ రీప్లేస్మెంట్ లో ఈ ప్రక్రియ చాలా అరుదైనది మరియు అత్యంత క్లిష్టమైనది. నాలుగు గంటల పాటు జరిగిన శస్త్ర చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ భుజం లో ఎముక లేదా కండరాలు బాగా దెబ్బతిన్నప్పుడు నొప్పిని తగ్గించి భుజం కదలికలను మెరుగుపరచడానికి షోల్డర్ రీప్లేస్మెంట్ ఎంతో ఉపయోగపడుతుందని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ షోల్డర్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌లోని సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్, అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అగ్రగామిగా కొనసాగుతూ, అత్యంత క్లిష్టమైన కేసులకైనా ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందిస్తున్నామని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి: శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్సై శ్రీధర్ రెడ్డి

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా కార్గిల్ దివస్
.jpg)
వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని సమస్యలు తీర్చండి
