ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు
సికింద్రాబాద్, జూలై01 (ప్రజామంటలు):
బల్కంపేట ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారని పేర్కొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారని ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
అమ్మవారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడం అదృష్టం అన్న కోట నీలిమ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని, పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ దేవతను మొక్కుకున్నానని తెలిపారు. గతంతో పోలిస్తే కళ్యాణోత్సవం ఈ సారి మరింత ఘనంగా జరిగిందన్నారు. ప్రొటోకాల్ సమస్యలు లేవని వివరించారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
ఉత్సవాల విజయవంతానికి దాదాపుగా నెల నుంచి ప్రతి రోజు ఆలయాన్ని సందర్శించి ఆయా డిపార్ట్ మెంట్ అధికారులతో, పెద్దలతో, స్థానికులతో, భక్తులతో దాదాపు 100కు పైగా సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి వాటికి అనుగుణంగా జాతర నిర్వహించామన్నారు. దాని పలితంగానే ఈ రోజు అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత ఘనంగా జరిగిందన్నారు. బోనాల పండగ నేపథ్యంలో ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. కళ్యాణోత్సవ విజయవంతానికి కృషి చేసిన ఆలయ సిబ్బందిని, ట్రస్ట్ బోర్డును, జీహెచ్ఎమ్సీ, పోలీస్ సహా అన్ని శాఖల అధికారులను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ పండగను తమ ఇంటి పండగలా భావించి విజయవంతం చేసిన ప్రజలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
