ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.
జగిత్యాల జూలై 28(ప్రజా మంటలు)
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. ఎస్. లత సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓ లతో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 93 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓలు మధు సుధన్, జివాకర్ రెడ్డి, DRDO రఘు వరన్, DPO మధన్ మోహన్, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

ఈయూ అమెరికా 15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు
.jpg)
సాంకేతిక లోపంతో టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
