గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి:  శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ 

On
గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి:  శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ 


జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు)

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సి పి ఆర్) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపి ఆర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థినిలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

శనివారం మధ్యాహ్నం 2 -30 గంటలప్రాంతంలో కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈకార్యక్రమంలో శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా సిపిర్ పై శిక్షణ ఇవ్వడానికి గాను డా సతీష్, డా బలరాం హాజరుకాగా, నిర్వాహకులు,రోటరీ -ఆపి -రెడ్ క్రాస్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ , టీవీ సూర్యం, ఏవిఎల్ఎన్ చారి, ఎన్.రాజు, బొడ్ల జగదీశ్, భూమేశ్వర్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి.లిల్లి మేరీ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ,  సి పి ఆర్ అనేది ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఉపయోగించే కీలకమైన ప్రథమ చికిత్స అని వివరించారు. ఇది వైద్య సహాయం వచ్చే వరకు మెదడు మరియు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి  ఎంతగానో సహాయపడుతుందన్నారు. నిమిషానికి 100–120 బీట్‌ల వద్ద ఛాతీ కుదింపులతో కూడినదనీ,అత్యవసరంగా ప్రాథమిక స్థాయిలో చేతులు మాత్రమే ఉపయోగించే సి పి ఆర్ బాధితుడు బ్రతకడానికి గల అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.

ప్రాణాలను కాపాడే సిపి ఆర్ జ్ఞానంతో ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పిస్తూ, శిక్షణ పొందడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి అభినందనలు చెపుతూ, నర్సింగ్ విద్యార్థినీ లు సిపిఆర్ పట్ల పూర్తి అవగాహన పెంచుకుని శిక్షణ పొందాలని ఎమ్మెల్యే సూచించారు.

Tags

More News...

Local News 

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ లో భుజం మార్పిడి విజయవంతం   దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ - డాక్టర్ బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్జరీ సక్సెస్ సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు):   కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో వైద్యులు ఆరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 27 సంవత్సరాల యువకుడికి ప్రమాదంలో  భుజం ఎముక విరిగిపోయి, భుజం కదపలేని పరిస్థితిలో బాధపడుతూ రోగి...
Read More...
Local News 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి  ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్    పెగడపల్లి జూలై 26 (ప్రజా మంటలు) వర్షాకాలం సీజనల్  వ్యాధులు పై  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణంలో పేషంట్ల  గదులలో శుభ్రంగా ఉండేలా చూడాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సూచించారు.      శనివారం రోజున పెగడపల్లి మండల    
Read More...
Local News 

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి:  శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ 

గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి (CPR )పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలి:  శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్  జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సి పి ఆర్) పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు. సిపి ఆర్ పట్ల అవగాహన కల్పించడానికిగాను రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్...
Read More...
Local News 

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక

క్రైస్తవుల జనాభాకు అనుకూలంగా చర్చిలు పెరగాలి - ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు): ఉప్పల్ జనాభాకు అనుగుణంగా మరిన్ని చర్చలు అవసరమని రెవరెండ్ డాక్టర్ కే.సుధాకర్ అన్నారు. ఆదివారం ఉప్పల్ స్వరూప్నగర్ లో జరిగిన ఉప్పల్ పాస్టర్ ఫెలోషిప్ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెవరెండ్ జాన్ బాబు మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధనలు కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ బోధించి, అనేకులను రక్షణ...
Read More...
Local News  State News 

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత

చురుకైన నాయకత్వాన్ని తీర్చిద్దుతాం - తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం - జాగృతి అధ్యక్షురాలు కవిత - నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  హైదరాబాద్ జూలై 26 తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో...
Read More...
Local News 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  - ఎస్సై శ్రీధర్ రెడ్డి 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  - ఎస్సై శ్రీధర్ రెడ్డి  గొల్లపల్లి (మేడిపల్లి),జులై 26 (ప్రజా మంటలు):   మేడిపల్లి, మండలాల ప్రజలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  అప్రమత్తంగా ఉండాలని,అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి,భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు,వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని మేడిపల్లి ఎస్సై
Read More...
Local News 

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్

గాంధీలో హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ - 390 మంది సిబ్బంది వ్యాక్సిన్ సికింద్రాబాద్, జూలై 26 (ప్రజామంటలు):హెపటేటిస్ బీ వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం రోటరీ క్లబ్ మణికొండ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీలోని మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ, డాక్టర్లు,మెడికల్ స్టూడెంట్స్,నర్సులు,పారామెడికల్ సిబ్బందికి మొత్తం 390 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కే.సునీల్ కుమార్,...
Read More...
Local News 

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది  ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ 

ప్రీస్కూల్ ఆక్టివిటీస్ తో చిన్నారులకు మేధాశక్తి పెరుగుతుంది   ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ  జగిత్యాల / బీర్పూర్  జులై 25 (ప్రజా మంటలు) :  ప్రీస్కూల్ యాక్టివిటీస్ తో చిన్నారి పిల్లలకు మెరుగైన మేధాశక్తి పెరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అన్నారు. శుక్రవారం ధర్మపురి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బీర్పూర్ మండలం చిత్రవెనిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ...
Read More...
Local News 

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ

దివ్యాంగుల ఆరోగ్య సంరక్షణలో వైద్య నిపుణులకు శిక్షణ సికింద్రాబాద్,జూలై 26 (ప్రజా మంటలు):    దివ్యాంగులకు సమగ్రమైన ఆరోగ్య సంరక్షణను అందించడం అనే అంశంపై  భాగంగా శనివారం నాడు గాంధీ మెడికల్ కళాశాలలో వైద్య నిపుణులకు శిక్షణ అందించారు. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి  ప్రొఫెసర్ డా.కోటేశ్వరమ్మ  ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగతకు అతీతమైన సామర్థ్యాలు సమగ్ర మరియు స్థిరమైన రేపటి కోసం సమగ్ర రోడ్
Read More...
Local News 

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా  కార్గిల్ దివస్

రాష్ర్టపతి నిలయంలో ఘనంగా  కార్గిల్ దివస్ పాల్గొన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ స్టూడెంట్స్... సికింద్రాబాద్ జూలై 26 (ప్రజామంటలు) : కార్గిల్ దివస్ సందర్బంగా శనివారం బొల్లారం లోని రాష్ర్టపతి నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి, అమరులైన వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు,పెయింటింగ్,వ్యాసరచనా,రంగోళి ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్...
Read More...
Local News 

వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు

వృద్ధుల సంరక్షణకు ఆర్డీవో ఆదేశాలు   జగిత్యాల జులై 25: కొడుకులు,కోడళ్లు తమను పోషించక పోగా,తమ పేరు మీద పట్టా ఉన్న 10 ఎకరాల భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇంట్లోంచి కొట్టి గెంటి వేశారని సారంగపూర్  మండలం పోతారం గ్రామానికి  చెందిన వృద్ధ తల్లిదండ్రులు కస్తూరి రాజం,యశోదల సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ సాయంతో ఆర్డీవో మధుసూదన్...
Read More...
Local News 

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని  సమస్యలు తీర్చండి  

ఇది ప్రజాపాలన మంత్రిగారు.... మా కాలనిలోని  సమస్యలు తీర్చండి   వర్షాకాలం వచ్చిందంటే బురద మయతున్న రోడ్డు...   సిసి రోడ్, భగీరథ నీరులేక కాలనీ ప్రజల అవస్థలు.. గొల్లపల్లి జూలై 26 (ప్రజా మంటలు);    వర్షాకాలం వచ్చిందంటే చాలు బురద మయమవుతున్న త్రాగునీరు,సిమెంటు రోడ్డు,సమస్యలతో ఆ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతితం. వివరాల్లో కి వెలితే... గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో 14 వార్డులు...
Read More...