గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):
తెలంగాణ సంస్కృతిలో భాగమై, తెలంగాణ పండగలలో ఒకటైన బోనాల పండుగను పురస్కరించుకొని, గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుంకరి రవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలంగాణ బోనాల పండుగ నిర్వహించారు.
ఇందులో భాగంగా పాఠశాలను రంగులతో ముస్తాబు చేశారు.
పాఠశాల ఆవరణలో విద్యార్థినీలు భక్తిశ్రద్ధలతో బోనాలను వండి ఊరేగింపుగా స్థానిక పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి బోనాలను, నైవేద్యాలను, మొక్కులను సమర్పించారు.కోలాటాలు, పోతరాజు వేషాలు, పులి వేషాలు, వారి అద్భుతమైన విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుంకరి రవి మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగను తమ పాఠశాలలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, దీని ద్వారా విద్యార్థులకు తెలంగాణ కళలు, సంస్కృతి సామాజిక సంబంధాలు, నాయకత్వ లక్షణాలు, బృంద చర్చలు, మొదల అంశాలపైన ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని, ఇవి విద్యార్థి మూర్తిమత్వం అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు."
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవిశంకర్, భోగ ప్రవీణ్, తిరుపతి, రాజేందర్ మామిడాల ప్రియాంక, వనిత, నాగ ప్రసన్న, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
