సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్
జగిత్యాల జూలై 20 (ప్రజా మంటలు)
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్ అన్నారు. ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులను ఆదివారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని అన్నారు. త్వరలో జరగబోయే ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60వ వార్షికోత్సవంలో జర్నలిస్టుల సహకారం ఉండాలని కోరారు.
జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పరిగణించే జర్నలిస్టులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం తాము చేస్తున్న కృషికి సమాజం కూడా తమకు అండగా నిలువాలని కోరారు.
వాకర్స్ యూనియన్ అధ్యక్షుడు గుండా సురేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారి సిరిసిల్ల వేణు గోపాల్, ఉపాధ్యక్షుడు హైదర్ అలీ, సహాయ కార్యదర్శులు చంద్రశేఖర్, చింత నరేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా సురేష్, ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, కోశాధికారి ఎంబారి శ్రీనివాస్, ఎర్ర నరసయ్య, చల్ల లక్ష్మారెడ్డి, రామేశ్వరరావు, అత్తినేని శంకర్, ములాసపు రాజన్న, పురుషోత్తం రెడ్డి, శ్రీధర్ రావు, రమణారావు, రఘునందన్, పరంధాం, రాజు, ముషీరుద్దీన్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
