వివిధగ్రామాల వృద్ధుల ఫిర్యాదులపై విచారణలు.
జగిత్యాల జూలై 19 ప్రజా మంటలు):
వయో వృద్ధులను నిరాదరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఆర్డీవో అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏ.ఓ.రవికాంత్ విచారణలు నిర్వహించారు.
గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన సింగం లక్ష్మీ,అదే మండలంకు చెందిన నందిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల రామవ్వ,జగిత్యాల పట్టణములోని వంజరివాడకు చెందిన తుదుగేని శారద, మంచినీళ్ల బావి వాడ కు చెందిన రాయిల్ల మల్లయ్యల తదితర ,వివిధ మండలాల గ్రామాల ఫిర్యాదు దారుల కుమారులను,కూతుర్లను,కోడళ్లను,అల్లుళ్ళను,మనుమలను, మనుమ రాళ్లను విచారించారు.విచారణలకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులకు,కోడళ్లకు,కూతుర్లకు,అల్లుళ్ళకు 2007 సంరక్షణ చట్టం,నియమావళి 2011, సెక్షన్ 24 పై సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ చేశారు.
ఆ తల్లిదండ్రుల పక్షాన సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ వాదనలు వినిపిస్తూ వారికి వృద్ధుల సంరక్షణ చట్టం కింద న్యాయం చేయాలని కోరారు. జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండిగే లక్ష్మీ అనే వృద్ధ తల్లిని,తండ్రి బాలమల్లు ను పోషించకుండా కొడుతూ,చంపుతనని బెదిరింపులకి గురిచేస్తున్న వారి పెద్ద కొడుకు పై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 24 ప్రకారము ఎఫ్.ఐ.ఆర్.నెంబర్.340/2024 తేదీ.29-7-2024 ద్వారా క్రిమినల్ కేసు నమోదు అయిందని,అలాగే జగిత్యాల ,కోరుట్ల,మెట్ పల్లి డివిజన్లలో కుమారులకు6 మాసాల జైలు శిక్షతో పాటు జరిమాన ఆర్డీవో లు విధించిన విషయాన్ని వివరిస్తూ హరి ఆశోక్ కుమార్ వివరించారు.
కొడుకులకు,కోడళ్లకు,కూతుర్లకు,మనుమలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. విచారణకు హాజరు కాని వారిపై చట్టపర చర్యలు ఉంటాయని ఏ.ఓ.రవికాంత్ హెచ్చరించారు.ఈ విచారణలో వృద్ధుల సంరక్షణ విభాగం సహాయకురాలు పద్మజ,తదితరులున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
