ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేట్ల పరం చేయవద్దు - జులై సార్వత్రిక సమ్మెలో పెన్షనర్లు పాల్గొనాలి
శ్రీకుమార్ సెక్రటరీ జనరల్, ఏఐఎస్ జిఇఎఫ్.
*టాప్రా భవన ప్రారంభోత్సవము
సికింద్రాబాద్, జూన్ 22 ( ప్రజామంటలు) :
ఉద్యోగుల కష్టార్జితాన్ని పెన్షన్ నిధులను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం డిఫైండ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెచ్చిందని , దానికి యూపీఎస్ అని పేరు పెట్టినా, కొత్తగా చేరిన ప్రయోజనం ఏమీ లేదని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ శ్రీకుమార్ అన్నారు. గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(టాప్రా) స్వంత కార్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్బంగా నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఒక వైపు ఉద్యోగులు, పెన్షనర్లు పాత పెన్షన్ విధానం కొరకు పోరాడుతుంటే, ఉన్న పెన్షన్ ని కూడ వేతన సవరణ చేసినప్పుడు సవరించకుండా ఉండేందుకు, కరువు భత్యం పెన్షనర్లకు చెల్లించకుండా ఉండే అధికారాల కోసం చట్టాలను తయారు చేసి ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేటర్ల పరం చేయవద్దని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఇపిఎఫ్ పీఏ జనరల్ సెక్రటరీ అతుల్ దిగే మాట్లాడుతూ..పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం జులై 9న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో పెన్షనర్లు కూడ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పెన్షనర్లు గౌరవంగా బతికేందుకు కనీసం నెలకు రూ9వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. పెన్షనర్లు తమ సమస్యలను చెప్పుకునేందుకు గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని టాప్రా జనరల్ సెక్రటరీ పి.కృష్ణమూర్తి పేర్కొన్నారు. అద్యక్షులు పి.నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎం.జనార్థన్ రెడ్డి, వీరయ్య,సీతారామ్, నర్సిరెడ్డి,ప్రభాకర్ నాయర్, ఎమ్ఎన్ రెడ్డి,ఆంజనేయులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దూద్ బావి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు
