ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు)
ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం కల వ్యవస్థ జర్నలిజం రంగం అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టి.యు.డబ్ల్యు జె(ఐజేయు) నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి బెంజెక్కి సంపూర్ణ చారి,కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్,ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదరలీ, సహాయ కార్యదర్శులు గుర్రం చంద్రశేఖర్,కోరేపు రాజ్ కుమార్,చింత నరేశ్,టిన్యూస్ మనోజ్ తదితరులను సన్మానించి వారి సేవలను హరి ఆశోక్ కుమార్ కొనియాడారు., హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని,జర్నలిస్టులకు ఆరోగ్యపథకాన్ని ప్రవేశ పెట్టాలని, ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని,చాలీ చాలని వేతనాలతో జీవితాలు గడుపుతున్న జర్నలిస్టులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
జర్నలిస్టుల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.తమ అసోసియేషన్ జర్నలిస్టులను సన్మానించిన సీనియర్ సిటీజేన్స్ సంఘం అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కౌన్సెలింగ్ అధికారి పి.సి.హన్మంత రెడ్డి,ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు,సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్, యూసుఫ్, యాకుబ్ హుస్సేన్, కస్తూరి శ్రీమంజరి, గంగం జలజ, రాధ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
