లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

On
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

లయన్స్ క్లబ్ లో పదవీప్రమాణ స్వీకారం
 - పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం

సికింద్రాబాద్, జూలై 19 (ప్రజామంటలు):

హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో  జరిగింది.  ముఖ్య అతిథిగా లయన్ సురేష్ జగ్నాని హాజరై 2025-–26 లయనిస్టిక్ సంవత్సరానికి నవభారత్  ప్రెసిడెంట్ గా లయన్  పి. స్వరూపారాణి, కార్యదర్శిగా రమణయ్య, కోశాధికారిగా  రాజీవ శర్మ తో పాటు  వనిత భారత్ క్లబ్  ప్రెసిడెంట్ గా లయన్ జి. కృష్ణవేణి, వైస్ ప్రెసిడెంట్ గా లయన్  పి. జ్యోతి రాజా, కార్యదర్శిగా లయన్ జి .లక్ష్మీ , కోశాధికారిగా లయన్  జయశ్రీ ల చేత ప్రమాణ స్వీకారం  చేయించారు. లయన్  కె. యాదయ్య గౌడ్ ఈ రెండు క్లబ్ లల్లో  నూతనంగా చేరిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, ఇండక్షన్ ఆఫీసర్ గా లయనిజం గురించి, సర్వీస్ ప్రాముఖ్యత గురించి వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ మోహన్ దాసు, ఎన్. రాంప్రసాద్ రావు , తదితరులు పాల్గొన్నారు, సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రసన్న, శైలజలకు రూ.5000 వనిత భారత్ తరపున అందజేశారు, మరొక బాలిక వర్ణికాకు చదువు కోసం రూ.32000 లను పిడుగు హరి ప్రసాద్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ఆంధ్ర ప్రదేశ్ తరపున  పి స్వరూపారాణి అందజేశారు.

Tags

More News...

Local News 

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి         జగిత్యాల జులై 19(ప్రజా మంటలు)   పట్టణంలోని వివిధ వార్డులలో ఇంకా మిగిలి ఉన్న నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం ను కౌన్సిలర్లతో కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. రానున్న పండగల దృష్ట్యా వెంటనే పోల్స్ వేయించి...
Read More...
Local News 

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస

108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు :   ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 లో ఈ ఏం టి గా ఉద్యోగం నిర్వహిస్తున్న అంకతి మానస శ్రవణ్ కి 2024 -  2025  జిల్లా ఉత్తమ ఇఎంటిగా, స్టార్ అవార్డు సాధించారు . శనివారం ఈ సందర్భంగా 108 జిల్లా ఇంచార్జ్  పిఎం జనార్ధన్ ,
Read More...

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు లయన్స్ క్లబ్ లో పదవీప్రమాణ స్వీకారం  - పేద విద్యార్ధులకు ఆర్థిక సాయం సికింద్రాబాద్, జూలై 19 (ప్రజామంటలు): హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో  జరిగింది.  ముఖ్య అతిథిగా లయన్...
Read More...
Local News 

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు పట్టించుకోని పంచాయతీ అధికారి.- కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలోని గత పది ఏండ్లుగా మురుగు కాలువలోని నీరు ఎటు వెళ్లక అక్కడే నిలువ ఉండడంతో  జనాలు నానా అవస్థలు పడుతూ  నిత్యం దోమలతో కుస్తీ పడుతూ అనారోగ్యాలకు గురి...
Read More...
Local News 

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత    జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు) శనివారం రోజున ఉదయం...*భగవద్గీత శిక్షణా తరగతులు*.10 రోజులు...శ్రీ వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో. భగవద్గీత. 5. అధ్యాయాలు.తాత్పర్య సహితంగా. శిక్షణ పటన తరగతులు. అంగరంగ. వైభవముగా. నిర్వహించడం. జరిగింది.. శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. *గీతా సత్సంగ్*.. ఆధ్వర్యంలో.శ్రీకృష్ణుని జ్ఞాపికను.. బహుకరించడం జరిగింది.
Read More...
Local News 

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు    జగిత్యాల, జులై 19( ప్రజా మంటలు) అంబిటస్ స్కూల్లో చిన్నారుల వివిధ వేషధారణాలతో చేపట్టిన బోనాల పండుగ సంబరాలు అంబరాన్నాంటాయి. కొందరు చిన్నారులు నెత్తిన బోనమెత్తుకొని, పోతరాజుల హల్ చల్, పులి వేషదారణ అహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రదర్శన అక్కడికి హాజరైన అహుతులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ కార్యక్రమం లో స్కూల్ చైర్మన్ శ్రవణ్ రెడ్డి,...
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో శని వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన "యమ ధర్మరాజును దర్శిస్తే", "యమపురి" ఉండబోదని...
Read More...
Local News  Crime 

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య  - ఇద్దరి అరెస్ట్!

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య  - ఇద్దరి అరెస్ట్! వెల్గటూర్ జూలై 19 ప్రజా మంటలు): వెల్గటూర్ మం. కిషన్ రావు పేటలో ఈనెల 17న జరిగిన యువకుడి హత్య సంచలనంగా మారింది. దళిత వర్గానికి చెందిన మల్లేష్ (28)ను నిన్న కత్తులతో పొడిచి చంపేశారు.అగ్ర  కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అందుకే హత్య చేశారని మల్లేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.   నిన్న యువతి
Read More...
Local News 

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .ధర్మపురి జూలై 19 ( ప్రజా మంటలు)   శనివారం రోజున ధర్మపురి మండలం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయ భూ సేకరణ విస్తరణ భూములు మరియు ఇండ్ల స్థలాలను పరిశీలించి, పనులను వేగవంతంగా  చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ధర్మపురి
Read More...
Local News 

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు 

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు  గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):  మల్యాల మండలం లోని శ్లోక కన్వెన్షన్ హాల్ లో  గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల,పెగడపల్లి మండలాల విద్యుత్ సిబ్బందితో విద్యుత్ ప్రమాదాల నివారణ మరియు విద్యుత్ భద్రత ప్రమాణాలపై సూపరింటెండ్ ఇంజనీర్ బి. సుదర్శనం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న...
Read More...
Local News 

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ .. జగిత్యాల జులై 19 (ప్రజా మంటలు)   ఈనెల 18వ తేదీన మెట్టుపల్లి లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో  600 మీటర్ల పరుగు పందెంలో పి యశ్వంత్ కుమార్  10 వ తరగతి మొదటి స్థానం....
Read More...
Local News 

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు): తెలంగాణ సంస్కృతిలో భాగమై, తెలంగాణ పండగలలో ఒకటైన బోనాల పండుగను పురస్కరించుకొని,  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్  ప్రిన్సిపల్ సుంకరి రవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలంగాణ బోనాల పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలను రంగులతో ముస్తాబు చేశారు.పాఠశాల ఆవరణలో విద్యార్థినీలు భక్తిశ్రద్ధలతో  బోనాలను...
Read More...