వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్
జగిత్యాల జూలై 20 : (ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం, సేవా
భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ జయంతి అన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన 150 మంది శిక్షార్తులకు ఆదివారం వాల్మీకి ఆవాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ జయంతి మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం ద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వివిధ హోదాల్లో స్థిరపడడం ఆనందదాయకం అన్నారు. మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణను అందజేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా ఆవాస నిర్వాహకులు అడుగులు వేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్ మాట్లాడుతూ సేవా భారతి ద్వారా దేశవ్యాప్తంగా 1,70,000 వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించేందుకు సేవా భారతి వివిధ రకాల వృత్తి విద్య కోర్సులలో శిక్షణ ఇస్తుందన్నారు. సేవా భారతి నిర్వహించే కార్యక్రమాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్, సేవా భారతి అధ్యక్షులు ఎస్పీ సుబ్రహ్మణ్యం, విభాగ్ సేవ ప్రముఖ ఆకు రాజేందర్, కట్ట చంద్రశేఖర్, తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, రవీందర్ రాజు, ఆవాస కార్యదర్శి మదన్ మోహన్ రావు, ఆవాస కమిటీ సభ్యులు అశోక్ రావు, సంపూర్ణ చారి, హరీష్, మధుకర్, వెంకటేశ్వరరావు,
సత్యం జీ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
