శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విధులు సక్రమంగా నిర్వహించగలరు - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 21 (ప్రజా మంటలు)
శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సక్రమంగా నిర్వర్తించ గలుగుతాము అన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు ప్రదాన కార్యాలఅయం ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో జిల్లా ఎస్పి ,పోలీస్ అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్బం గా ఎస్పీ మాట్లాడుతూ.... యోగ విద్య ఒక అద్భుతమైన ప్రక్రియగా అభివర్ణిస్తూ, మన భారతావని ప్రపంచానికి అందించిన ఆరోగ్య ఫలం యోగ అని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీ బిజీ గా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని, ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు.
యోగా వల్ల మనదేశానికి ప్రపంచంలో ఒక మంచి స్థానం వచ్చిందని, ఇది ప్రతీ భారతీయుడు గర్వపడే అంశం అని, యోగ వల్ల జరిగే లాభాలు గురించి వివరించారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలందించగలమని అన్నారు.
మిగతా ఎక్సర్సైజ్ లగా కాకుండా , ఎక్కడైనా, ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం యోగ అని అన్నారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు. అధికారులు,సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట పాటు యోగా చేస్తే చాలా వరకూ లైఫ్ స్టయిల్ అనారోగ్యం పాలుకాకుండా ఉండవచ్చనన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీలు రఘు చందర్,రాములు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్ , శ్రీధర్, రామ్ నరసింహా రెడ్డి, అనిల్ కుమార్, సుధాకర్,కరుణాకర్,రవి,సురేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
