ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
జగిత్యాల జులై 19 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని శ్రీ పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం లో వేముల రాంరెడ్డి చే జరుగుతున్న భగవద్ గీత శిక్షణ తరగతులు 10 వ రోజు ఘనంగా ముగిశాయి.
శనివారం ,14 వ అధ్యాయంలోని గుణత్రయ విభాగయోగము గురించి ఆచార్యులు రాంరెడ్డి చాలా చక్కగా తనదైన శైలిలో తాత్పర్య సహితంగా, ఒక్కొక్క పదాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ,వారు మధ్య, మధ్య,ఎన్నో అడ్డ కథలు, సామెతలు చిన్నకథలు, హాస్య చలోక్తులు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతుంటే, నవ్వుల జల్లులు కురిపిస్తుంటే శ్రోతలు ఆనందంగా హాయిగా నవ్వడం కనిపిం చింది .
ఆచార్యులు చెప్పే సంస్కృత శ్లోకాలను ఎంతో శ్రద్ధతోవినడం పటించడం, ఈ సంస్కృత శోకాల్ని తప్పకుండా నేర్చుకోవాలనే తపన మహిళల్లో కనిపిం చిందని తెలిపారు. ఈ భగవద్గీత శిక్షణా తరగతుల వల్ల,వీటిని నేర్చుకోవడం వల్ల, సమాజానికి మేలు కలుగుతుందని మానసిక ఉల్లాసం వస్తోందని, అంతరాత్మ శుద్ధి అవుతుందని, వాక్ శుద్ధి కలుగుతుందని, ప్రతినిత్యం ఈ భగవద్గీత శ్లోకాలు చదవాలనీ అన్నారు. ఈ నాటి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని భగవద్గీత యొక్క
ప్రాసశాస్త్యా న్నీ వివరించారు.
ఈనాటి కార్యక్రమంలో నారాయణదాసు ఆశ్రమ ప్రధాన అర్చకులు ఉమాశంకర్, శివ ప్రియ, నిర్వాహకులు ఎలగందల కైలాసం, నూనె కుమార్, మార రాజేశం, కటుకం సురేష్, మరియు వ్యాఖ్యాతగా పాం పట్టి రవీందర్ వ్యవహరించారు. సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం మాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
