పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు
పట్టించుకోని పంచాయతీ అధికారి.- కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య
గొల్లపల్లి జూలై 19 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలోని గత పది ఏండ్లుగా మురుగు కాలువలోని నీరు ఎటు వెళ్లక అక్కడే నిలువ ఉండడంతో జనాలు నానా అవస్థలు పడుతూ నిత్యం దోమలతో కుస్తీ పడుతూ అనారోగ్యాలకు గురి అవుతున్న పద్మశాలి కాలనీలో వాసులు ముఖ్యంగా ఇళ్ల నుంచి వాడుక నీరు బయటకు వెళ్లే మార్గం లేక, గతంలో కరెంటు మోటర్ ద్వారా పంపింగ్ చేసేది అది కాస్త చెడిపోవడంతో ప్రధాన రోడ్లపై చేరి,నిలిచి ఉంటు వర్షం నీరు కూడా కాలువల ద్వారా వెళ్లడం లేదు ,ఫలితంగా రోడ్లపై నీరు నిలిచి ఉండటం, దుర్వాసన దోమలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు అంకం భూమయ్య ఆరోపించారు.
ముఖ్యంగా ఇళ్ల నుంచి వచ్చే నీరు డ్రైనేజీలో నిలిచి రోడ్లపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ దుర్వాసన వస్తుంది,అని ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ముందస్తు వర్షాలతో కాలనీ లో నీరు నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగి,మలేరియా ఇతర దోమ ద్వారా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.నీరు నిలిచిపోవడం వల్ల రోడ్లు దెబ్బతింటాయి,కాలనీలో మురికి కాలువ లేకపోవటం వల్ల పదవ వార్డు కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మా సమస్యను వెంటనే పరిష్కరించాలి గ్రామ ప్రజలు కోరుతున్నారు.ఈ విషయంపై పంచాయతీ అధికారిని వివరణ కోరగా నిధులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనిపై అధికారులు మరియు ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
