వర్ష కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్రంలో టిబి ముక్త్ భారత్ కార్యక్రమం.
వైద్యాధికారి డా.అనిల్ కుమార్ .
ఇబ్రహీంపట్నం జూన్ 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏ ఏ ఎం వర్ష కొండ కేంద్రంలో టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆక్టివ్ కేస్(T.B) డిటెక్షన్ (తెమడపరీక్ష) క్యాంపును నిర్వహించారు. ఇందులో 11మంది నుండి క్షయ అనుమానిత లక్షణాలు గల వారి తెమడ పరీక్ష నమూనాలను సేకరించి ట్రూ నాట్,మెట్ పెల్లి పరీక్షకు పంపించడం జరిగింది.
క్షయ వ్యాధి నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్( ఎస్ టి ఎస్) ఆంజనేయులు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను వివరిస్తూ రెండు వారాల పైబడి దగ్గు, సాయంత్రం పూట జ్వరము, ఆకలి మందగించడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లయితే తెమడ పరీక్షలో క్షయ నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి నుండి డాట్స్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు.
నిక్షయ్ పోషణ్ యోజన గూర్చి వివరించారు. అలాగే క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి పౌష్టిక ఆహారం కొరకు సహాయం అందించడానికి నిక్షయ మిత్ర ప్రాముఖ్యత గురించి గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ విజయభాస్కర్, సి హెచ్ ఓ శైజాద్ సుల్తానా, ఎం ఎల్ హెచ్ పి మాధవి, హెచ్ ఇ ఓ కృపాకర్, ఏ ఎన్ ఎం భవాని మరియు ఆషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
