బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

On
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

- అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- భక్తులతో కిక్కిరిసిన ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసరాలు - పోలీసుల భారీ బందోబస్తు

సికింద్రాబాద్, జూలై 13 (ప్రజామంటలు):

లష్కర్ లో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్త జన కోటి ఉజ్జయిని శ్రీమహాకాళి ఆలయానికి పోటెత్తారు. భక్తి ప్రవత్తులతో తమ ఇలవేల్పు ఉజ్జయిని మహాకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పించి, తమ మొక్కులను తీర్చుకున్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11.40 గంటలకు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.  ఈసందర్బంగా ఉజ్జయిని అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను సమర్పించారు.  


ప్రతి ఏటా ఆషాడ మాసంలో మొదటి ఆదివారం జరిగే శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి అర్చకులు చేసిన తొలి పూజలతో బోనాల జాతర ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం  ప్రభాకర్ దంపతులు ఆలయాన్ని సందర్శించి, ఆలయ సంప్రదాయనుసారంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి, పూజలు చేశారు.IMG-20250713-WA0009 

ఉదయం నుంచి వివిద ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు తలపై బోనం ఎత్తుకొని, క్యూలైన్ ద్వారా ఆలయంలోనికి వెళ్ళి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. అలాగే సిటీలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల నుంచి శివసత్తులు, జోగినిలు తమ బృందంతో భాజభజంత్రీలు, పోతరాజులు, ఒగ్గుడోలు విన్యాసాలతో ఆలయానికి వచ్చి, బోనాలు సమర్పించారు. చాలా మంది భక్తులకు అమ్మవారు పూనడంతో వారు పూనకంతో ఊగిపోయారు. తోటి భక్తులు అమ్మవారి బొట్టు వీరికి పెట్టి, శాంతింప చేసి, త్వరగా అమ్మవారి దర్శనానికి లోనికి తీసుకువెళ్ళారు. ఆయా ఆలయాల నుంచి తొట్టెలను కూడ తీసుకు వచ్చి, అమ్మవార్లకు సమర్పించారు.  
క్యూలైన్ లో చెమటలు కక్కిన మహిళలు:
ఆదివారం వాతావరణం ఎండగా ఉండటంతో ఉక్కబోతతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి వచ్చే క్యూలైన్ లల్లో బోనం ఎత్తుకొని నిల్చున్న మహిళలు చెమట పట్టి అసౌకర్యానికి గురయ్యారు.దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర వరకు  సమయం పట్టడంతో మహిళలు ఊసురుమన్నారు.

కాగా ఒక్క బోనం వెంట పోలీసులు ఐదుగురిని మాత్రమే అనుమతించగా, మిగితా వారు ఇతర క్యూలైన్లలో రావాల్సి వచ్చింది. కాగా ఆలయానికి వచ్చిన కొందరు వీఐపీలు అత్యుత్సాహం ప్రదర్శించగా పోలీసులు  వారితో వాగ్వివాదానికి దిగారు.  మీడియా పాయింట్ వద్ద విలేఖరులు కూర్చోనేందుకు కనీసం కుర్చీలు కూడ లేకపోవడంతో గంటల తరబడి వీరు నిలబడాల్సి వచ్చింది. కొందరు పోలీసులు పాసులున్నప్పటికీ కొందరు  మీడియా వారిని లోనికి అనుమతించకపోవడంతో వారు కొంత అసౌకర్యానికి గురయ్యారు.కాగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సారి వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచడటంతో భక్తులకు తాగు నీటి ఇబ్బందులు కలగలేదు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ స్వయంగా ఆలయం వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి తొక్కిసలాట, ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ కనిపించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ...బోనాల వేడుకల సందర్బంగా ఆలయ పరిసరాల్లో బందోబస్తు కోసం మొత్తం 2500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినట్లు తెలిపారు.

ఆలయ ఆవరణలోని 150 సీసీ కెమెరాలను మహాకాళి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి, రౌండ్ ఏ క్లాక్ పర్యవేక్షించినట్లు తెలిపారు.  అలాగే లంచ్ తర్వాత ర్యాపిడ్ యాక్షన్  ఫోర్స్ సిబ్బంది కూడ బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు పలు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. 
సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు ప్రాంరభమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లోని ఆయా ఆలయాల నుంచి సంప్రదాయ బద్దంగా పోట్టెళ్ళతో అమ్మవారి వాహనాన్ని భాజ , భజీంత్రాలతో, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఉజ్జయిని ఆలయానికి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో...
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బన్సీలాల్ పేట్ లోని చారిత్రాక మెట్ల బావి వద్ద నుండి 200 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఒగ్గు డోలు కళాకారులు, పోతరాజులతో ఆటపాటలతో ఉమ్మడి బోనాలతో భారీ ఊరేగింపు సాగింది. ర్యాలీగా వెళ్ళి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను  సమర్పించారు. ఈసందర్బంగా ఒగ్గుడోలు కళాకారులు, పోతరాజులు చేసిన విన్యాసాలు, ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ వెన్నెల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 


రేపే రంగం (భవిష్యవాణి)


ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడ సోమవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఆలయంలో  రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పచ్చికుండపై నిల్చోని స్వర్ణలత భవిష్య వాణి వినిపిస్తారు.  ఆ తర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుంది. జూపార్క్ నుంచి తెప్పించిన ఏనుగుపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి, ప్రధాన ఆలయం నుంచి  ఆలయ సంప్రదాయనుసారంగా ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు కన్నులపండువగా కొనసాగనుంది. IMG-20250713-WA0011

Tags

More News...

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా బొక్కల స్రవంతి హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు
Read More...
Local News 

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి  సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి  సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు)   వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ  సూచించారు.జిల్లా కేంద్రం లో  కేంద్రం లో ఏర్పాటు చేసిన గణేశ్  మండపాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహకులకు సీసీ కెమెరాలను ఏర్పాటు...
Read More...
Local News 

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు 

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు  జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి .ఉదయము సాయంత్రం నిర్వహిస్తున్న పూజల్లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కుటుంబాలతో పాల్గొని వినాయక మూర్తికి వివిధ రకాల నివేదనలను సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం తో రెండవ సంవత్సరంలో...
Read More...
Local News 

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం 

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం  జగిత్యాల ఆగస్టు 30 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ  వీధి లోని రెడ్ బుల్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష మండపం వద్ద శనివారం సహస్ర మోదక హవనం నిర్వహించారు .దీనిలో భాగంగా దుర్గాదేవి ,గణేష్ అధర్వ శీర్షం ,శ్రీ సూక్తం, మన్యు సూక్తం ,రుద్ర హవనం నిర్వహించారు. వైదిక క్రతువులు...
Read More...
Local News 

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు 

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు  జగిత్యాల ఆగస్టు 30 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం ప్రదోష పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు.     వైదిక క్రతువునుపాలెపు వెంకటేశ్వర శర్మ ,సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ నిర్వహించగా ,శ్రీధర గణపతి శర్మ , కీర్తిశేషులు రుద్రాంగి విశ్వనాథ శర్మ...
Read More...
Local News 

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి  - పరామర్శించిన బీజేపీ నేత మర్రి సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు):   ప్రముఖ కాంగ్రెస్ నాయకులు,న్యూ బోలక్ పూర్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొండే రవి కుమార్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, శుక్రవారం రాత్రి కన్నుమూశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి శనివారం ఉదయం న్యూ
Read More...
Local News 

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ  చాన్సలర్  భేటి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ  చాన్సలర్  భేటి సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు): సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసించే  వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( VIT) విశ్వవిద్యాలయం స్థాపకులు,ప్రస్తుత చాన్సలర్  విశ్వనాథన్  మనుమరాలు వివాహ మహోత్సవం జరగనుంది.  కొందరి ప్రముఖులను ఆహ్వానించుటకై  హైదరాబాద్ వచ్చిన విశ్వనాథన్ శనివారం  తార్నాకలోని మాజీ మంత్రి,ఎన్​డీఎమ్ఏ మాజీ వైస్​ ప్రెసిడెంట్​ మర్రి శశిధర్...
Read More...
Local News  State News 

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

 కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 30 (ప్రజా మంటలు): నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  పునరుద్ఘాటించారు.  హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన...
Read More...
Local News 

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ  

 పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ   (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 30 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని పట్టణ సేవా సంఘం పద్మశాలి సంఘ భవనంలో  కుంకుమ పూజ కార్యక్రమం శనివారం ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు ఈ ప్రత్యేక పూజలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి కుంకుమార్చన చేసి, కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ  ఆశీర్వాదాలు...
Read More...
Local News  State News 

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని గృహనిర్బంధం చేసిన పోలీసులు  సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు) :  రంగారెడ్డి జిల్లాలోని అనాజ్ పూర్ గ్రామంలో పేదలకు చెందిన 125 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈ మేరకు శనివారం...
Read More...
Local News  State News 

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో  దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో  దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి రెండు రోజుల తర్వాత మేనమామల చెంతకు కార్తీక సికింద్రాబాద్, ఆగస్ట్ 30 (ప్రజామంటలు) : మూడేళ్ల చిన్నారికి పెద్ద కష్టమే వచ్చింది. లోకజ్ఞానం ఎరుగని చిన్నారి తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతిచెందగా, మానసిక ఆందోళనతో  తనని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది.  దిక్కుతోచని స్థితిలో ఉన్న పాపను సెక్యూరిటీ సిబ్బంది చేరదీశారు. పత్రికల్లో వచ్చిన వార్త...
Read More...
Local News 

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం   ఇబ్రహీంపట్నం ఆగస్టు 30 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల వర్ష కొండ గ్రామంలోని గంగపుత్ర సంఘంలో కొలువుతీరిన గణనాథుని సన్నిధిలో శనివారం రోజున యజ్ఞము మరియు అన్న ప్రసాదము నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ దొంతుల తుకారాం, మాజీ ఉపసర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ పొనుకంటి...
Read More...