కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం రాజ్యాంగ హక్కులకు భంగం - తెలంగాణ హెచ్ఆర్సీ
హైదరాబాద్ ఆగస్ట్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల సంఘం (TGHRC), చైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో, వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, నల్గొండ విద్యాసంస్థలోని తొమ్మిది మంది బి.ఫార్మసీ విద్యార్థులు దాఖలు చేసిన ఫిర్యాదుపై (HRC No. 4897 of 2025) విచారణ చేపట్టింది.
విద్యార్థులు సమర్పించిన ఫిర్యాదులో, కళాశాల యాజమాన్యం ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావలసి ఉందనే కారణంతో వారి ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. స్టడీ సర్టిఫికెట్లను నిలిపివేయడం విద్యార్థుల రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించేదని పేర్కొంటూ, మానవ హక్కుల రక్షణ చట్టం, 1993 లోని సెక్షన్ 18(c) కింద ఉన్న అధికారాలను వినియోగించి, సంబంధిత కళాశాల చైర్మన్ మరియు ప్రిన్సిపాల్ తక్షణమే విద్యార్థుల ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వడమే కాక, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (TCలు) జారీ చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది.
అలాగే, కళాశాల చైర్మన్ మరియు ప్రిన్సిపాల్ లను వ్యక్తిగతంగా 02.09.2025న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ, ఈ ఉత్తర్వుల ప్రతిని నల్గొండ జిల్లా కలెక్టర్‌కు మరియు తెలంగాణ ఉన్నత విద్యా మండలికి వారికి తక్షణ చర్య కోసం పంపించింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
