భారత్ ప్రపంచానికి అందించిన గొప్ప వరం "యోగ"ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలకు డా. బి. శంకర్
జగిత్యాల జూన్ 21(ప్రజా మంటలు)
భారతదేశం ప్రపంచ మానవాళికి అందించిన గొప్ప వరం యోగ అని ప్రముఖ వైద్యులు, ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను వాల్మీకి ఆవాసం సేవా భారతీయ ఆధ్వర్యంలో స్థానిక గీత విద్యాలయం మైదానంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 దేశాలలో యోగ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
యోగ సాధన వల్ల శారీరక, మానసిక ఒత్తిడి దూరమై మనిషి ఆరోగ్యకరంగా జీవించగలుగుతారని తెలిపారు. యోగ సాధనలో శ్వాసను నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకు పెరుగుతుందని దీనికి యోగ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన గొప్ప ఆరోగ్య కరదీపిక యోగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగను భాగస్వామి గా చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యోగ శిక్షకులు డాక్టర్ గుండేటి ధనుంజయ, గడ్డం పూర్ణిమ, ఆవాస కమిటీ సభ్యులు ఎన్నమనేని అశోకరావు, బెజ్జంకి సంపూర్ణాచారి, తుంగూరి సురేష్ మల్లేశం, బిజెపి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు దివాకర్, రాగిళ్ల సత్యనారాయణ, శంకర్,గాధాసు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
