ఎస్సీఆర్ఈఎస్ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా వేగి మురళీకృష్ణ
సికింద్రాబాద్, జూన్ 19 (ప్రజామంటలు):
సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ (ఎస్సీఆర్ఈఎస్) డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా వేగి మురళీకృష్ణ నియమితులయ్యారు. ఇటీవల రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సర్వసభ్య సమావేశంలో వేగి మురళీకృష్ణ ను నియమిస్తూ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య ఉత్తర్వులు జారీ చేశారు. రైల్ కళారంగ్ లో జరిగిన సమావేశానికి సికింద్రాబాద్, హైదరాబాద్ గుంటూర్,గుంతకల్,నాందేడ్ డివిజన్లకు సంబందించిన కార్యకర్తలు, డివిజన్ నాయకులు, వర్కింగ్ కమిటీ మెంబర్స్ హజరయ్యారు.ఈసందర్బంగా ఎస్సీఆర్ఈఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ..కార్మికులకు ఎల్లవేళలా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ అండగా ఉంటుందని, కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా ఎన్నికైన వేగి మురళీకృష్ణ మాట్లాడుతూ...కార్మికులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తున్న తనకు ఈ పదవిని ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనను డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా నియమించిన జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య, జాయింట్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
